అతి తక్కువ కాలంలో కస్టమర్ల నాడిని పట్టుకున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో. భారత టెలికాం రిలయన్స్ జియో సంస్థ హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ కొట్టింది. ఇక ఈ కంపెనీలో పెట్టుబడులు జోరు కొనసాగుతూనే ఉంది. అది అలా ఉండగా మరోవైపు ఫిబ్రవరి నెలలో అరవై రెండు లక్షలకు పైగా కొత్త కస్టమర్లను జియో లోకి కొత్తగా చేరడం జరిగింది. ఇక దీంతో రిలయన్స్ జియో భారతదేశంలో అతి పెద్ద టెలికాం సంస్థ గా అవతరించింది.

IHG

 


ఇక మరో టెలికాం సంస్థ భారతి ఎయిర్ టెల్ లో కొత్తగా 9 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారు. రిలయన్స్ జియో సంస్థలో 38.28 కోట్లకు పైగా భారతి ఎయిర్టెల్ సంస్థలో 32.9 కోట్లకు పైగా కస్టమర్లను ప్రస్తుతం కొనసాగుతున్నారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పేర్కొంది.

 

IHG

ఇక ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 4.39 కోట్ల కొత్త కస్టమర్లతో మొత్తం 11. 99 కోట్ల కస్టమర్లను కలిగి ఉంది. ఇక మరోవైపు వోడాఫోన్ ఐడియా కస్టమర్ ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ కంపెనీలో 34.67 లక్షల మంది కస్టమర్లు కోల్పోయింది. ఇక దీంతో ఐడియా వోడాఫోన్ కస్టమర్ల సంఖ్య 32.5 కోట్లకు చేరుకుంది. ఇక అలాగే భారతదేశంలో జనవరి చివర్లో ఉన్న 115.64 కోట్ల వైర్ లెస్ కస్టమర్స్ నుండి ఫిబ్రవరి చివరి నాటికి ఆ సంఖ్య 116.05 కోట్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: