సహజంగా మనం ఏదైనా ఒక రోజులు పని చేయకుండా బద్దకిస్తే ఆ పని మరుసటి రోజుకి మరింత ఎక్కువై పోతుంది. తర్వాత చూసుకుందాంలే అని దానిని కనుక వదిలేస్తే అది అసలు ఎప్పటికీ అవ్వదు. ప్రస్తుతం కరోనా కాలం వల్ల పిల్లలు భర్త ఇంట్లోనే ఉంటున్నారు. దీని కారణంగా ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీని వల్ల పని భారం, ఒత్తిడి తగ్గుతాయి అని అందరూ అనుకున్నారు . కానీ పని భారం ఇంకా ఎక్కువై పోయింది. స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. దీని ద్వారా ఒత్తిడి కూడా ఎక్కువై పోతోంది.

అయితే పని ఒత్తిడి పెరిగిన ఆస్ట్రేలియన్ మహిళ కోడి క్విన్లివన్ బట్టలు ఉతకడానికి ఒక రూమ్ లో పడేసింది. రెండు నెలల పాటు బట్టలు తప్పకుండా అక్కడ పడే సరికి బట్టలు అన్నీ కూడా పేరుకు పోయాయి. తాను ఇంక ఏమీ చేయలేదని లాండ్రీ షాప్ కి పంపాలి అనుకుంది . లాండ్రీ షాప్ కి పంపే ముందు ఆమె బట్టలు పైకి ఎక్కి కూర్చుని ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానికి మౌంట్ ఫోల్డ్ మోర్ అనే పేరు పెట్టింది.
దీనిని చూసిన నేటిజన్లు పలు కామెంట్లు విసిరారు. నేను ఒక్క దాన్నే కాదు ఇలా చాలా మంది ఉన్నందుకు ఆనందంగా ఉందని కామెంట్ చేసింది ఒక ఆమె. మరొకరు అయితే మహారాణిలా ఫోజ్ ఇచ్చింది అని కామెంట్ చేసారు . అయితే ఆమె లాండ్రీ కి పంపిన తర్వాత వాటిని ఉతికి ఐరన్ చేసి 50 సంచుల్లో కోడికి అందించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి