ఇటీవలే వర్షాకాలం పూర్తి శీతాకాలం ప్రారంభమైన సమయం లో ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ నగరా న్ని భారీ వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ ఎరుగని విధంగా భారీ వర్షం కురిసిన నేపథ్యం లో హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయి  వరదల్లో మునిగి తేలింది. దీంతో హైదరాబాద్ నగరం లో ఏర్పడిన నష్టం అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ నాళాలు  పొంగి  జనజీవనం స్తంభించి పోయింది. జనావాసాల్లోకి నీరు చేరి నగర వాసులు అందరూ తీవ్ర దుర్భర స్థితిని అనుభవించే పరిస్థితి వచ్చింది.



 ఇక జలదిగ్బంధంలో కి వెళ్లిపోయిన హైదరాబాద్ నగరం ఇప్పటికీ కూడా పూర్తిస్థాయి లో వరదల ప్రభావం నుంచి కోలుకోవడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు తెలంగాణ ప్రభుత్వం వరదల్లో చిక్కుకు పోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాల కు తరలించేందుకు ఇప్పటికీ కూడా సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. ఇక హైదరాబాద్లోని అన్ని కాలనీలలో వాహనాలతో కాదు ఏకంగా బోట్ల సాయంతో వరద నీటిలో ప్రయాణించేలా పరిస్థితి వచ్చింది. రికార్డు స్థాయిలో  తెలంగాణ రాష్ట్రంలో భారీ పంట నష్టం కూడా వాటిల్లింది.


 ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి 10 వేల కోట్ల వరకు నష్టం జరిగింది అని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక అందించింది. భారీ వర్షం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 8633 కోట్ల పంట నష్టం వాటిల్లిందని.. రహదారులకు 222 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఇక జిహెచ్ఎంసి 567 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం వరద సహాయక చర్యల కోసం తక్షణమే 550 కోట్లు విడుదల చేసినట్లు నివేదికలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: