నేడు మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలను గురించి అందరికీ తెలిసినదే. వయసుతో సంబంధం లేకుండా మృగాడు స్త్రీల పట్ల వ్యవరిస్తున్న తీరు అమానుషం, అకృత్యం, పైశాచికం. కాగా అమీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా 'దంగల్' లో నటించిన న‌టి sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ గురించి అందరికీ విదితమే. ఆ తరువాత దంగల్ సినిమా ఆమెకు ఇంటి పేరుగా మారింది అనే సంగతి కూడా మనకు తెలుసు.

ఇందులో ఆమె రెజ్ల‌ర్‌ గీతా ఫోగట్ పాత్రలో దుమ్ము లేపింది. నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. కాగా.. ఈ నటి చిన్న వయస్సు నుండే సినిమాల్లో నటిస్తుందని విషయం అతి కొద్దిమందికి తెలుసు. భామనే సత్యభమనే, వన్ 2 కా 4 వంటి చిత్రాలలో ఈమె బాల‌న‌టిగా క‌నిపించింది. ఇకపోతే తాజాగా పింక్‌విల్లా.కామ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఫాతిమా స‌నా షేక్ తన జీవితంలో చోటుచేసుకున్న‌ భయంకరమైన లైంగిక వేధింపుల అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

త‌న‌కు 3 సంవత్సరాల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే ఓ మృగాడు లైంగిక వేధింపుల‌కు పాల్పడినట్టు వాపోయింది. లైంగిక వేధింపుల స‌మ‌స్య అనేది చాలా సున్నితమైన అంశం అని, అందుకే మ‌హిళ‌లెవ‌రూ కూడా త‌మ జీవితాల్లో చోటుచేసుకున్న లైంగిక దాడుల గురించి నోరు తెరవరు అని చెప్పుకొచ్చింది. కాగా నేడు ప్ర‌పంచం కొంచెం మారిందని, ఇపుడు మహిళలకు స్వేశ్చగా మాట్లాడే అవకాశం ఉందని అన్నారు. ఇక దీనిపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  

అలాగే, తాను బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌ను కూడా ఫేస్ చేసినట్టు చెప్పారు. ఉద్యోగం ల‌భించే ఏకైక మార్గం సెక్స్‌కు అంగీక‌రించ‌డం మాత్ర‌మే అని చెప్ప‌బ‌డిన దౌర్భాగ్య ప‌రిస్థితులు నేడు ఉన్నాయ‌న్నారు. అలాగే తాము అడిగిన ప‌నికి అంగీకరించని పక్షంలో సినిమాలనుండి తీసేసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయ‌న్నారు. ఇకపోతే ఈమె ప్ర‌స్తుతం లుడో, సూర‌జ్ పే మంగ‌ల్ భ‌రీ మూవీల్లో న‌టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: