ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా కనపడటం లేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఆ పార్టీ నేతలకు కూడా దాదాపుగా లేదని చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో పార్టీలో కీలక నేతలు కొంతమంది ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారు అని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు బలోపేతం కావాల్సిన సమయంలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా ఆందోళన కలిగిస్తుంది.

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కూడా ఇప్పుడు సమర్థవంతంగా వ్యవహరించ లేకపోతుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా టీడీపీనిఎదుర్కొని నిలబడటం అనేది దాదాపు కష్టసాధ్యమే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బిజెపి నేతలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది,

కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుని ఆ పార్టీని పూర్తిగా నాశనం చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది కీలక నేతలను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డి అనుచరులు కొంతమందిని బీజేపీ లోకి తీసుకుని వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి వర్గాన్ని ఇప్పుడు బీజేపీ లోకి తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వెళ్తున్నట్టు గా సమాచారం. అయితే ఎవరు పార్టీ మారతారు ఏంటి అనే దాని పై ఇంకా ఎలాంటి స్పందన కూడా రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: