గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటి అనేది తెలియక పోయినా ఇప్పుడు మాత్రం కొన్ని కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు కొంత మందికి కొన్ని సూచనలు చేస్తున్నారు.

ప్రజలందరినీ కూడా పోలింగ్ బూత్ కి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని అదేవిధంగా కచ్చితంగా గెలుస్తారు అని భావించిన అభ్యర్థులతో పార్టీ నేతలు అందరూ కూడా టచ్ లో ఉండాలని సూచనలు చేస్తున్నారు. లేనిపక్షంలో అనవసరంగా ఇబ్బందులు ఉంటాయని భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన సూచిస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు రోజు కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. గెలిచే అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ హోటల్ కి తరలించింది.

అలాగే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ నేతలను కొంత మందిని కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలకు దిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా తమ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అయితే ఇతర పార్టీలు మాత్రం ఈ విషయంలో ఘోరంగా వెనకబడి ఉన్నాయి. మరి ఇతర పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీకి మాత్రం పరిస్థితి కాస్త కష్టంగానే కనపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చూడాలి మరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: