కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్‌లో బీజేపీలో చేరతానని ప్రకటించిన విషయం తెల్సిందే .  తిరుమల శ్రీవారిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకొని .. ఆసక్తికర వ్యాఖ్యలుు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతుందని మొట్టమొదటగా చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు .తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని, అన్నదమ్ములు గా కలిసే ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివేనని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు.

దీంతో కోమటిరెడ్డి విషయాన్ని కాం గ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఆయన చేసిన ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణా సంఘం నివేదికను ఏఐసీసీ కోరింది.రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పార్టీ వర్గాలను ఆదేశించినట్టు సమాచారం.దీంతో తిరుపతిలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, గతంలో చేసిన కామెంట్స్‌తో కూడిన రిపోర్ట్‌ను ఏఐసీసీకి క్రమశిక్షణా సంఘం పంపించింది. నేడో, రేపో రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి వ్యవహా రంపై ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డితోనూ అధిష్టాన దూతలు మాట్లాడినట్టు తెలిసింది. తన సోదరుడి తీరు తనకూ అంతుచిక్కడం లేదని, అయితే ప్రస్తుత పరిణామాలకు తనకు ఎలాం టి సంబంధం లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది

 రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టడంతో పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగినందున తాను ఆ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవినిచ్చే విషయంలో ఉప్పందడంతోనే రాజగోపాల్‌రెడ్డి ఈ విధంగా స్పందిస్తున్నారా అన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. . 

మరింత సమాచారం తెలుసుకోండి: