చిన్నపిల్లలకు ఉయ్యాల ఊగడం మహా సరదా. ఓ ఏడేళ్ల బాలికకు ఉయ్యాల ఊగాలని అనిపించింది. సరదాగా ఆడుకోవాలని అనిపించి ఇంట్లో అమ్మచీరతో కట్టిన ఉయ్యాల కనిపించింది. ఆ ఉయ్యాలలో కూర్చొని ఊగసాగింది. తనని తాను గుండ్రంగా కళ్లు తిరిగేలా ఒంటరిగా ఉయ్యాల ఊగసాగింది. అలా ఊగినప్పుడు చేసిన చిన్న తప్పే ప్రాణాలు తీసేసింది.

చిన్నప్పుడు చిన్నపిల్లలకు తల్లిదండ్రులు జోల పాటడం.. ఉయ్యాల ఊపడం చేస్తుంటారు. అమ్మ పాటలు వింటూ గాఢ నిద్రలో జారుకునే చిన్నారులను చూస్తూనే ఉంటాం. ఓ బాలిక పెరిగి పెద్దయినా అదే అలవాటు కొనసాగింది. చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటూ ఇంట్లో కట్టిన ఉయ్యాలలో ఊగసాగింది. గుండ్రంగా తిరుగుతూ ఉయ్యాలను చుట్టుకుంటూ ఒంటరిగా ఉయ్యాలతో ఆడుతూ కూర్చోంది. కానీ ఆ బాలికకు ఏం తెలుసు.. ఆ ఉయ్యాల అవుతుందని.. గుండ్రంగా తిరుగుతున్న ఉయ్యాలను ఒక్కసారిగా వదిలింది బాలిక. ఒక్కోసారిగా అంతే వేగంతో ఉయ్యాల చుట్టుకుంటూ ఆమె గొంతును నులిమేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన సజ్జనపు రవీంద్ర, సత్యవతి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు మోషిక (7). రోజులాగే ఇద్దరు దంపతులు శనివారం పనికి వెళ్లారు.  ఇంట్లో ఒంటరిగా ఉన్న మోషితకు సరదాగా ఆడుకోవాలని అనిపించింది. ఇంట్లో ఉన్న ఉయ్యాలలో ఊగసాగింది. నిలువుగా ఉయ్యాల ఊగకుండా.. ఆ ఉయ్యాలను గుడ్రంగా తిరుగుతూ కూర్చుంది. గుడ్రంగా తిరుగుతూ కొన్ని చుట్టలు చుట్టుకుని వదిలేస్తే.. ఆ ఉయ్యాల తనకు తాను తిప్పేస్తుంది.

అలా ఎక్కువసేపు తిరుగుతూ ఉయ్యాలను ఒక్కసారిగా వదిలేసి కళ్లు మూసుకుంది. ఒక్కసారిగా ఉయ్యాల వేగంగా తిరుగుతూ మోషిక గొంతుకు బిగించుకుంది. దీంతో మోషిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అది గమనించిన స్థానికులు చిన్నారిని ఉయ్యాలలోంచి కిందకు దింపారు. తల్లిదండ్రులు పాపను పట్టుకుని ఏడుస్తున్న దృశ్యం స్థానికం తీవ్ర కలత రేపింది. చిన్నారి మరణంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: