ఒక్కొక్కటిగా వైసీపీకి అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చూసి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టడంతో వైసీపీలో పండుగ వాతావరణం నెలకొంది. ఇది ఇలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. టిడిపి ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిని వ్యతిరేకించిన జగన్ ఇప్పటికే అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేసి తీరాలని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నిస్తునే వస్తున్నారు. ఇప్పటికీ అది నెరవేరలేదు.
2020 దాదాపు
విశాఖ లో పరిపాలన
రాజధాని ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధమైన సమయంలో, ఆ వ్యవహారం కాస్త కోర్టుకు వెళ్లడంతో, అప్పటి నుంచి అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు 2021లో ఖచ్చితంగా విశాఖకు పరిపాలన
రాజధాని తరలించాలని
జగన్ చూస్తున్నారు. దీనికోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. రాబోయే ఉగాది కి
రాజధాని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీనికోసం ఏప్రిల్ 13వ తేదీ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అప్పటికి కోర్టులో ఉన్న వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి అని భావిస్తున్నారు. ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ కావడం తో రాజధాని ఫైల్ కదులుతుందని , తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని
జగన్ నమ్ముతున్నారు.
అందుకే మరో మూడు నెలల్లో
రాజధాని ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ నిర్ణయం వాయిదా పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది . మౌలిక సదుపాయాలు దగ్గర నుంచి అన్ని వ్యవహారాలు పైన ప్రత్యేక దృష్టి సారించారు. 2021 తమకు అన్ని రకాలుగానూ కలిసి వస్తుందనే నమ్మకంతో
జగన్ ఉన్నారు.
జగన్ రాజధాని ఆశలు అతి తొందరలోనే తీరే అవకాశం కనిపిస్తుంది.