ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో తామే ముందున్నామ‌ని .. చెప్పుకొనే వైసీపీ స‌ర్కారుకు బ్రాహ్మ‌ణుల నుంచి తీవ్ర ప్ర‌శ్న‌లే ఎదుర‌వుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసిన జ‌గ‌న్‌.. ఈ స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారి క‌ష్ట‌న‌ష్టాలు కూడా తెలుసుకున్నారు. ఈ నేప‌థ్యంలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల వారు కూడా జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. ఆల‌యాల్లో క‌నీస ఖ‌ర్చుల‌కు ప్ర‌భుత్వం నిధులు కేటాయించాల‌ని.. కోరుకున్నారు. అదే స‌మ‌యంలో దేవ‌దాయ ప‌రిధిలోని ఆల‌యాల్లో పురోహితులు అంద‌రినీ ప‌ర్మినెంటు ఉద్యోగుల కింద ప‌రిగ‌ణించాల‌ని కోరారు.

ఇక‌, పురోహిత సంఘాల‌కు కూడా ప్ర‌భుత్వం గుర్తింపు ఇవ్వాల‌ని.. కార్పొరేష‌న్ ద్వారా స‌భ‌లు, స‌మావేశాలు పెట్టుకునే అవ‌కా శం క‌ల్పించాల‌ని కోరారు. వివాహాల‌కు ఇబ్బందులు ఏర్ప‌డుతున్న క్ర‌మంలో అర్చ‌క వృత్తిలో ఉన్న బ్రాహ్మ‌ణ యువ‌కుల‌కు వివా హ క‌ట్నం కింద కొంత మొత్తం ఇస్తే.. దీంతో వివాహాలు చేసుకునేందుకు యువ‌తులు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని .. ఈ స‌మ‌స్య‌ను ప్రధానంగా ప‌రిగ‌ణించాల‌ని కూడా కోరుకున్నారు. కార్పొరేష‌న్ ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని కూడా కోరారు.

ఆయా అంశాల‌పై బ్రాహ్మ‌ణ నాయ‌కులు చెప్పిందంతా విన్న‌త‌ర్వాత‌.. మ‌న ప్ర‌భుత్వం రాగానే న్యాయం చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కూడా జ‌గ‌న్ చేసింది ఏమీలేద‌ని అంటున్నారు బ్రాహ్మ‌ణ సామాజిక సంఘాల‌కు చెందిన నాయ‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ప్ర‌భుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా అప్ప‌ట్లో స్పందించిన జ‌గ‌న్‌.. కొన్నింటిని నెర‌వేరుస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఈ క్ర‌మంలోనే వంశ‌పారంప‌ర్య హ‌క్కుల‌ను పున‌రుద్ధ‌రించార‌ని.. అయితే.. ఇది న్యాయ వివాదంగా మారింద‌ని అంటున్నారు.

ఇక‌, పింఛ‌న్ల విష‌యంలోను, కార్పొరేష‌న్‌ను బ‌లోపేతం చేసే విష‌యంలోనూ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ది లేద‌ని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు ఇస్తున్న ప్రాధాన్యం బ్రాహ్మ‌ణుల‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో మాత్రం చూపించ‌డం లేద‌ని వాపోతున్నారు.

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


మరింత సమాచారం తెలుసుకోండి: