ఏపి లో మున్సిపల్ ఎన్నికల తంతు మొదలైంది. మంగళ వారం, బుధవారాల్లో నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ జరగుతుంది. దాదాపు పోటీలో దిగనున్న అభ్యర్థుల వివరాలు తెలిసిపోయాయి. ఏపి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లాపై అందరి దృష్టి పడింది. మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలు కూడా వైసీపీ కి అనుకూలంగా వచ్చాయి. అది కూడా కడప నియోజక వర్గాల్లో.. దీంతో పురపాలక ఎన్నికలు కూడా వైసీపీకి అనుకూలంగా వస్తాయని సదరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు  నిజం చేసేలా నిన్న నామ పత్రాల ఉపసంహరణ జరిగింది. తొలి రోజు 211 నామపత్రాల ఉపసంహరణ,100 స్థానాల్లో ఏకగ్రీవాలు జరిగాయి.


ఇది ఇలా ఉండగా..మునిసిపల్‌ ఎన్నికల్లో వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. నిన్న కడప బీజేపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మలమడుగు నగర పంచాయతీలోని 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఇస్మాయిల్‌ ను మేము కిడ్నాప్‌ చేశామని ఆయన తల్లితో ఫిర్యాదు చేయించారని వాపోయారు. ఇస్మాయిల్‌ స్వతహాగా ఇష్ట పూర్వకంగానే దేవగుడికి వచ్చానని మీడియా ముందు చెప్పిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.


అధికార పార్టీకి పోలీసులు మద్దతు తెలుపుతున్నారు. అది ఇష్మాయిల్  విషయంలో స్పష్టమైంది. ఒకటో తేదీ రాత్రి పోలీసులే దేవగుడి గ్రామానికి వచ్చి ఇస్మాయిల్‌ను బలవంతంగా తీసుకెళ్లి మంగళవారం ఒత్తిడి చేసి నామినేషన్‌ ఉపసహంరించుకునేలా చేయడం బాధాకరమన్నారు. ప్రతి పక్షనాయకుడు పి.రామసుబ్బారెడ్డి జైలులో ఉన్న సమయంలో కూడా అన్ని పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జమ్మలమడుగులో భాజపా గెలిస్తే రాష్ట్రంలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న భయంతో బలవంత ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కడపలో వైసీపీ శ్రేణులు రౌడీలు గా ప్రవర్తిస్తున్నారు.. నామినేషన్ వేస్తున్న వారి పై దౌర్జన్యాలు చేస్తున్నారు... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి నేతలు నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: