కరోనా మహమ్మారి వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా ఇంకా స్వార్థమనే లక్షణాన్ని ప్రజలు విడనాడటం లేదు. ఇప్పటికీ విజయవాడలో ఎన్నోసార్లు అధిక వడ్డీల పేరుతో జరిగిన దారుణాలు వెలుగులోకి రాగా ఇప్పుడు అధిక వడ్డీల పేరుతో హిజ్రాలను వేధిస్తున్న అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ న్యూ రాజరాజేశ్వరి పేటలో హిజ్రాలు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీల పేరుతో చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ సెవెన్ సిస్టర్స్ మీద వాళ్ళు ఆరోపణలు చేశారు. అంతేగాక సెవెన్ సిస్టర్స్ మీద విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. 


వడ్డీ లపై చక్రవడ్డీ లు వసూలు చేస్తూ అదేమని ప్రశ్నించినందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 వేల రూపాయలు అప్పు తీసుకుంటే వారానికి ఐదు వేల రూపాయలు వడ్డీ చెల్లించాలని కరోనా కారణంగా తమకు ఆదాయం లేదని చెప్పినా వాళ్ళు వినడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక అప్పు తీర్చలేదని ఇళ్ల మీదకు వచ్చి గొడవ చేస్తూ దుర్భాషలాడుతూ ఉన్నారని ఫిర్యాదులో హిజ్రాలు పేర్కొన్నారు. 


వాళ్ళ బాధలు భరించలేక వేరే ప్రాంతంలో అద్దెకి వెళదామని ప్రయత్నిస్తే అక్కడ కూడా అద్దెకు ఇల్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా అరవై ఐదు వేల రూపాయలు అప్పు తీసుకుంటే రెండు లక్షల రూపాయలు చెల్లించాలని బెదిరిస్తున్నారని వాళ్ళు చెప్పినట్లు డబ్బు చెల్లించకపోతే కొడతామని కూడా బెదిరిస్తున్నారని హిజ్రాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నో రోజులు వేచి చూసిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు కలగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని హిజ్రాలు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని హిజ్రాలు పోలీసు అధికారులను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: