ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది.. ఆ వ్యక్తి తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది. చేసుకుంటే అతన్ని చేసుకుంటాను అంటూ పట్టుబట్టింది.. ఇక తన పంతం నిలబెట్టుకుని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత ఊహించనంత ఆనందంగా జీవితం గడిచిపోతుంది అని కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది. ఇక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఎంతో గర్వంగా ఫీల్ అయింది. కానీ మహిళ ఆనందం మాత్రం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్లికి ముందు నువ్వు లేకుండా అసలు బతకలేను అంటూ చెప్పిన భర్త.. పెళ్లి తర్వాత మాత్రం.. అదనపు కట్నం లేకపోతే నిన్ను భరించలేను అంటూ అసలు రంగు బయట పెట్టాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సర్వస్వం అనుకున్న ఆ మహిళ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
చివరికి ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ పెళ్లి తర్వాత ప్రేమ లేదు అన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇక కొన్ని రోజుల్లోనే భార్యను అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆ మహిళ ఇక తనకు చావే దారి అనుకుంది. ఇక తల్లి మనసును మరింత కఠినతరం చేసుకుని తన కూతురు కొడుకు తో పాటు ఇక వేగంగా కదులుతున్న రైలు నుంచి కిందకు దూకింది. ఈ క్రమంలోనే ఇక తల్లి అరుణ కూతురు సాత్విక అక్కడికక్కడే ప్రాణాలు వదలగ.. కొడుకు సాత్విక్ ప్రస్తుతం తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు భర్త ప్రవీణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి