అధికార పార్టీలో ఉంటే నాయకులకు ఏదొక పదవి తప్పనిసరిగా వస్తుందనే చెప్పొచ్చు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులకు పదవుల పంపకాలు జరుగుతాయి. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అదే కార్యక్రమం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతలకు పదవుల పండగ నడుస్తోంది. ఇటీవల కూడా నామినేటెడ్ పదవులని భర్తీ చేశారు. పలు కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌లని నియమించారు.

అయితే ఈ నామినేటెడ్ పదవుల్లో సినీ నటులు ఆలీ, పోసాని కృష్ణమురళిల పేర్లు కనిపించలేదు. ఈ ఇద్దరు గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి పోసాని, జగన్ వెనుకే ఉంటున్నారు. వైసీపీ నాయకుడుగా ఉన్న పోసాని, టీడీపీపై ఎలాంటి విమర్శలు చేస్తారో అందరికీ తెలిసిందే. మొదటినుంచి పార్టీలో పనిచేస్తున్న పోసానికి ఎలాంటి పదవి లేదు.

కానీ జగన్ అనేకసార్లు పదవులు ఆఫర్ చేసినా సరే పోసాని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారని తెలుస్తోంది. రాజ్యసభతో పాటు పలు పదవులని ఆఫర్ చేసిన తాను సున్నితంగా తిరస్కరించినట్లు పోసాని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అంటే పోసానికి జగన్ ఎప్పుడు మంచి అవకాశాలే ఇస్తున్నారని చెప్పొచ్చు. అటు ఆలీకి కూడా వైసీపీలో పదవి రాలేదు. గత ఎన్నికల ముందు ఈయన టీడీపీ తరుపున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా ఆలీ ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఎన్నికల్లో టికెట్ దక్కలేదు గానీ, ఆ పార్టీ తరుపున మాత్రం ప్రచారం చేశారు. అయితే తర్వాత ఆలీకి వక్ఫ్ బోర్డు లేదా ఏపీ స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఆ పదవులు వేరే నేతలకు ఇచ్చేశారు. మరి ఆలీకి జగన్ ఎలాంటి పదవి సెట్ చేస్తారో చూడాలి లేదా నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా సీటు ఇస్తారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: