బీజేపీ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు దేశ‌వ్యాప్తంగా ప్ర‌ణాళిక‌లు మొద‌ల‌య్యాయి. మొన్న‌టికి మొన్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ తో భేటీ అయ్యారు. రాబోయే స‌ర్వ‌త్రిక ఎన్నిక‌లతో పాటు, రాష్ట్ర‌ప‌తి ఎంపిక‌లో బీజేపీ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకు వ‌చ్చేందుకు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న ప్ర‌తిప‌క్ష కూట‌ముల‌న్ని ఒక తాటిపైకి రావాల‌ని మ‌మ‌త పిలుపున‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన‌ పెగాసస్‌ వివాదం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దూకుడును మ‌రింత‌గా పెంచారు. పెగాస‌స్ వివాదంపై రాష్ట్రంలో ఓ క‌మిటీని వెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీని త‌రువాత ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు ఆమె వెళ్లారు. అక్క‌డ ప్ర‌ధాని మోడీని క‌లిశారు. అనంత‌రం కాంగ్రెస్ నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌తో భేటీ అయ్యారు.


  ప‌ర్య‌ట‌న విజయ‌వంతంగా ముగిసిన అనంత‌రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మ‌మ‌త బెనర్జీ. ఇకపై తాను ప్రతి రెండు నెలలకోసారి ఢిల్లీకి వస్తానని వెల్లడించిన ఆమె... బీజేపీని అధికారం గ‌ద్దెను కూలదోసేంత వరకు ''ఖేలా హాబ్' కొనసాగుతుందని ప్రకటించింది. ప్ర‌తి ప‌క్ష నేత‌ల‌తో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తన తక్షణ కర్తవ్యమన్న దీదీ 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ' తన నినాదమని తెలిపారు.

   దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలపై మండిపడ్డారు మ‌మ‌తా బెన‌ర్జీ. ప్రతి ఒక్కరి నినాదం దేశాన్ని రక్షించడమే అని తెలిపారు. దేశంలో నెల‌కొన్న‌ రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల‌తో చర్చించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఐక్యత విష‌యంలో నెల‌కొన్న సమస్యపై కూడా చర్చించామని తెలిపారు దీది.

   మోడీ-షాలకు చెక్‌ పెట్టే వ్యూహంలో భాగంగానే ఢిల్లీ కి వచ్చిన మమతా తాజా ప్రకటనతో మరింత రాజకీయ వేడిని సృష్టించారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్షాల నాయ‌కురాలిగా ఈ తృన‌ముల్ అధినేత్రి ఉంటుందేమోన‌నే ఊహాగానాలు కూడా మొద‌ల‌య్యా. మొత్తానికి 2024 ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌భుత్వానికి  బెంగాల్‌ లాంటి షాకివ్వాలని మమత గట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp