కరోనాలో కొత్తగా వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్‌.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అనేక దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 100కుపైగా దేశాల్లో ఈ ఒమిక్రాన్ వ్యాపించింది.. పలు దేశాల్లో క్రమంగా కొత్త ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బ్రిటన్‌లో 12 మంది వరకూ ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు ఆ దేశ ఉప ప్రధాని ప్రకటించారు. అటు అమెరికాలోనూ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. దీంతో ఒమిక్రాన్ పేరు చెబితేనే అనేక దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


అయితే.. ఒమిక్రాన్ గురించి దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణురాలు ఓ గుడ్ న్యూస్ చెబుతున్నారు. అసలు ఒమిక్రాన్‌ను మొదట గుర్తించిందే ఈ దక్షిణాఫ్రికా దేశంలో.. ప్రపంచానికి కాస్త ఉపశమనం కలిగించే ఆ  వార్త గురించి ఒమిక్రాన్‌ను మొదట గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ చెబుతున్నారు. తమ దేశంలోని చాలా మంది ఒమిక్రాన్ బాధితులు సాధారణ, సులభమైన చికిత్సతోనే ఈ వేరియంట్‌ నుంచి కోలుకుంటున్నారట. ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయట. అంటే ఒమిక్రాన్ గురించి మరీ అంతగా భయపడాల్సిదేమీ లేదన్నమాట.


అయితే.. ఒమిక్రాన్‌ విషయంలో తగిన జాగ్రత్తలు మాత్రం అవసరమని డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ చెబుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్ నిర్ధరణ అయిన తర్వాత తక్కువ మోతాదులో కార్టిసోన్, ఐబూప్రొఫెన్ వంటి ఔషధాలు వాడుతున్నారట. ఇవి కూడా కండరాల నొప్పి, తలనొప్పి కోసం  చికిత్స అందిస్తున్నారట. అంతకు మించి ప్రత్యేకంగా ఎలాంటి మందులూ వాడటం లేదట. వాటి అవసరం కూడా రావడం లేదట.


గతంలో డెల్టా వేరియంట్ సమయంలో వాడినట్టు ఆక్సిజన్, యాంటీబయాటిక్స్ అవసరం ఒమిక్రాన్ బాధితుల్లో అవసరం పడటం లేదని డాక్టర్ కోయెట్జీ చెబుతున్నారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో నమోదైన కేసుల్లో చాలా వరకు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలే కనిపించాయట. చాలా కొద్ది మందికి మాత్రం పొడి దగ్గు, గొంతు నొప్పి ఉందట. టీకా ఒక్క డోసు తీసుకున్నవారిలో కూడా ఈ వేరియంట్‌ లక్షణాలు స్వల్పంగానే కనిపించాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: