ఎండాకాలం పోయింది..ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది..దాంతో ఎక్కడ చూసినా కూడా భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఎంతో మంది ఇబ్బంధులను ఎదుక్కొన్నారు.వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) ప్రకటించింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ లో ఈ ఏడు వర్షపాతం 103 శాతంగా ఉంటుందని ఐఎండీ వాతావరణ విభాగం అంచనా వేసింది.



మాములుగా కురిసే వర్షపాతం 96 నుండి 104 శాతం పరిధిలో ఉంటుంది. 1961-2010 మధ్య సేకరించిన డేటాను భర్తీ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ లో 1971-2020 మధ్య నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షపాతం డేటా ఆధారంగా ఐఎండీ కొత్త LPAను ప్రవేశపెట్టింది. ఈ ప్రకారం లాంగ్ పీరియడ్ యావరేజ్  87 cm లేదా 870 mmలుగా ఉంది. రుతుపవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్) దేశవ్యాప్తంగా ఎల్పిఎలో 103 శాతం ఉంటుందని, అందులో 4 శాతం +/- నమూనా లోపం ఉండొచ్చని ఐఎండి డైరెక్టర్ తెలిపారు.



ఇకపోతే గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మధ్య, దక్షిణ భారతంలో (ఎల్పీఏలో 106 శాతం కంటే ఎక్కువ) రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని, ఈశాన్యంలో (ఈ ప్రాంతంలో ని ఎల్పీఏ లో 96నుంచి106 శాతం) మరియు వాయువ్య భారతంలో (ఈ ప్రాంతంలో 92 నుంచి108 శాతం ఎల్పీఏ తో) సాధారణ వర్షపాతం ఉంటుందని ఆయన చెప్పారు. వర్షాకాలం అంతటా ‘లా నినా’ పరిస్థితులు కొనసాగుతాయని.. భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంపై లా నినా పరిస్థితులు, అలాగే వర్షాకాలంలో హిందూ మహాసముద్రంపై ప్రతికూల హిందూ మహాసముద్ర ద్విధ్రువ  పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.కానీ ఒక్కోసారి అంచనాలను మించి కూడా ఉండవచ్చునని సమాచారం..ఏది ఏమైనా మన జాగ్రత్తల్లొ మనం ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: