జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతటి పిరికివాడో తాజాగా బయటపడింది. పవన్ నోరు లేవటం అంతా ఓన్లీ ఏపీలో మాత్రమే. అదే తెలంగాణాకు వచ్చేసరికి అసలు తాను ఉన్నట్లు కూడా ఎవరికీ తెలీకూడదన్నంత జాగ్రత్తగా ఉంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆమధ్య ఏపీలో పవన్ తెలంగాణా సంస్కృతి గురించి మాట్లాడుతు తెలంగాణా జనాల్లో చాలామందికి అసలు వరన్నమంటేనే తెలీదన్నారు. ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టిన తర్వాతే జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని జనాలు  బియ్యం వండుకోవటం మొదలుపెట్టారని చెప్పారు.

ఇదే విషయమై తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా రియాక్టయ్యారు.  పవన్ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతు ‘వాడెవడో సినిమా యాక్టరట..పనికిమాలినోడు ఏదేదో మాట్లాడాడు అంటు మండిపోయారు. తెలంగాణా వాళ్ళకి వరన్నం తినటం ఎన్టీయార్ నేర్పినాడు అని మాట్లాడాడు’ అంటు ధ్వజమెత్తారు. వాడంత మూర్ఖుడిని ఇంతవరకు చూడలేదంటు రెచ్చిపోయాడు. దాదాపు 1200 ఏళ్ళ క్రితమే తెలంగాణాలో కాకతీయుల కాలంలోనే చెరువుల కింద జనాలు వరిని పండించిన విషయం ఆ యాక్టరుకు తెలీదేమో అంటు మండిపడ్డారు.

మాట్లాడేటపుడు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటు గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఇపుడీ రిప్లై సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనను మంత్రి అంత ఘాటుగా మాట్లాడినా పవన్ ఎందుకు సమాధానం చెప్పలేదు. ఏపీలో మంత్రులకో లేకపోతే వైసీపీ నేతలకో చెప్పుచూపించినట్లుగా తెలంగాణా మంత్రికి పవన్ ఎందుకని చెప్పు చూపించలేకపోతున్నారు ?

ఏపీలో చూపించినట్లు తెలంగాణాలో మంత్రులకు చెప్పు చూపిస్తే ఏమవుతుందో పవన్ కు బాగా తెలుసు. అందుకనే తనను అంతలా కించపరుస్తు మంత్రి మాట్లాడినా పవన్ నోరెత్తలేదు. పవన్ కాదు చివరకు జనసేన నేతలు కూడా అసలు రియాక్టే కాలేదు. దీంతోనే తెలంగాణా ప్రభుత్వం అన్నా, మంత్రులన్నా పవన్ అండ్ కో ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోంది. మరి తాను ఎవరికీ భయపడనని పవన్ పదేపదే చెప్పుకోవటం కూడా భయాన్ని దాచిపెట్టుకోవటంలో భాగమనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: