రాజకీయ నాయకులు ఒకరినొకరు సాధించాలి అనుకుంటే అవతలి వాళ్ళ అక్రమాస్తుల గురించి హైలెట్ చేస్కుంటూ ఉంటారు. ఈ విధంగా హైలెట్ చేయడం వల్ల వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ల ఆలోచన అయి ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అధికార వర్గం ఇంకా ప్రతిపక్ష వర్గం ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్న జగన్ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు జగన్ ని విమర్శిస్తూ ఉంటారు.


అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి అవి అక్రమార్జన అని చంద్రబాబు అంటున్నట్టు తెలుస్తుంది‌. అలాగే అవి అక్రమాస్తులు అని చంద్రబాబు కేసు పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలో చంద్రబాబు ఆస్తులు కూడా అక్రమాస్తులు  అంటూ సిఐడి కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబుపై పేరుకి సిఐడి హెడ్ కేసు పెట్టినా ఈ కథంతా వెనకాల ఉండి నడిపించేది ప్రభుత్వం.


లింగమనేని ప్రాతిపదికపై చంద్రబాబుపై కేసు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న గెస్ట్ హౌస్ లింగమనేని గెస్ట్ హౌస్ కాబట్టి దానికి అటాచ్మెంట్ నోటీసు ఇవ్వడం జరిగిందట. ఆ అటాచ్మెంట్ విషయంలో ఏసీబీ కోర్టులో ప్రభుత్వం దీనిపై వాదనలు కొనసాగిస్తుంది. అయితే ఇప్పుడు ఈ అక్రమస్తుల కేసు ముందుకు వెళ్తుందా ఆగిపోతుందా అనేది ఏసీబీ కోర్టు చేతిలో ఉంటుందని తెలుస్తుంది.


ఏసిబి కోర్టు న్యాయవాదుల చేతిలో ఉంటుంది. అక్కడ ఆల్రెడీ వాదనలను కూడా వినేశారు. ఈ వాదనలను వింటున్న సమయంలో ప్రభుత్వం ఈ వాదనలను వినడం అనవసరం అని ఆల్రెడీ ఈ కేసు విషయంలో ఆస్తుల జప్తుకు మేము ఆదేశించావమని ప్రభుత్వం చెప్పింది. కానీ వాదనలను వినడానికే ఆసక్తిని చూపించారు న్యాయవాదులు. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత తీర్పును జూన్ ఆరో తారీకు అంటే ఈరోజుకు వాయిదా వేశారు. మరి ఈరోజు కోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: