తెలుగుదేశంపార్టీ-జనసేన పొత్తు వ్యవహారం అలాగే అనిపిస్తోంది. తాజాగా జనసేన ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తు విషయంలో అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలను ఎవరు ప్రశ్నించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రశ్నించటానికే పార్టీని పెట్టినట్లు చెప్పుకునే జనసేనలో పవన్ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకూడదని నాగబాబు వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే పవన్ ఎవరినైనా ప్రశ్నించవచ్చు కానీ పవన్ను మాత్రం ఎవరు ప్రశ్నించకూడదన్నట్లుగా ఉంది నాగబాబు వ్యవహారం.





అన్నీ కోణాల్లోను పవన్ ఆలోచించే అన్నీ నిర్ణయాలను తీసుకుంటారని సోదరుడు చెప్పారు. పార్టీకన్నా వ్యక్తులు ఎక్కువకాదన్న పద్దతిలోనే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలట. పవన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పారు. పార్టీ నిర్ణయాలను ఎవరం, ఎప్పటికి వ్యతిరేకించమని ప్రతిఒక్కళ్ళు ప్రతిజ్ఞచేయాలని నాగబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. బలవంతపు ప్రతిజ్ఞలు ఏమిటో అర్ధంకావటంలేదు. బలవంతంగా ప్రతిజ్ఞలు చేయిస్తే నేతలు ఎంతకాలం కట్టుబడుంటారు ?





తెలుగుదేశంపార్టీ నేతలతో వ్యక్తిగతంగా గొడవలు పడద్దు, అవమానకరంగా మాట్లాడద్దని స్పష్టంగా చెప్పారు. అంటే టీడీపీతో పొత్తు పార్టీలోని చాలామంది నేతలకు ఇష్టంలేదన్న విషయం అర్ధమైపోతోంది. రెండుపార్టీల ఐక్య కార్యాచరణ మొదలైతే టీడీపీతో జనసేన నేతలు ఎక్కడ గొడవలు పడతారో అనే టెన్షన్ నాగబాబులో బాగా కనబడుతోంది. పార్టీ ప్రతిష్టకు, సమగ్రతకు భంగం కలిగించే ఎంతటి నేతలపైన అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని కూడా హెచ్చరించారు.





పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేంత సీన్ ఉన్న నేతలు జనసేనలో అసలు ఎవరున్నారు ? పార్టీకి ఉన్న ప్రతిష్ట ఏముంది ? తిరుపతిలో రెండు రోజులు నాగబాబు సమావేశం పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలోనే ఒక నేత మాట్లాడుతు ‘ఇలా ఎంతకాలం జనసేన నేతలు రెండు పార్టీల జెండాలు మోయాల’ని సూటిగా ప్రశ్నించారు. దానికి నాగబాబు దగ్గర ఎలాంటి సమాధానం లేదు.  తాజా సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నగర, జిల్లాల పార్టీల అధ్యక్షులతో పొత్తు విషయంలో ఏకగ్రీవ ఆమోదం తెలుపుతు సంతకాలు చేయించుకున్నారు. దీంతోనే అర్ధమైపోతోంది టీడీపీతో పొత్తు జనసేనలో చాలామందికి ఇష్టంలేదని.




మరింత సమాచారం తెలుసుకోండి: