పొత్తు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది లీడర్లకు సైతం చాలా తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేతలు కొత్త పదవులు వస్తాయని ఆశిస్తే ఉన్న పదవులను కూడా ఉడగొట్టుకొని పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటి వరకు టిడిపి నేతలు చాలామంది పదవులు త్యాగాలు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులకు సైతం ఆదేశాలు జారీ చేశారు.. ఈ విషయం విన్న చాలా మంది నాయకులు సైతం ఎంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.బడా నేతలకు టికెట్లు పెట్టేలా చేస్తున్నారు ముఖ్యంగా టిడిపి జనసేన కూటమిలో సీట్ల పంచాయితీతో రెండు పార్టీలలోని చాలా టెన్షన్ మొదలయింది.

పొత్తులు ఎత్తులు ఏపీ టీడీపీ లీడర్లకు ఏమాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయం పైన ఒక అవగాహన వస్తే ఎవరు ఎక్కడెక్కడ ఉంటారనే విషయంపై క్లారిటీ వస్తుందంటూ పలువురు కార్యకర్తలు నాయకులు సైతం తెలుపుతున్నారు. చాలామంది సీనియర్ నేతలు సైతం కొన్ని సీట్ల పైన బాగా వేయాలని చూస్తున్నారు దీంతో జనసేన నేతలకు సైతం టెన్షన్కు అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీలలో సీట్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో వీరు బహిరంగ సభలో పెట్టినప్పటికీ ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో టీడీపీ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది.. ఇక జనసేన పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉన్నది.. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తర్వాత బయట కనిపించలేదు.


టిడిపి జనసేన మధ్య పొత్తు వచ్చి ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్న నియోజకవర్గస్థాయిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య సరైన అవగాహన రాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏడు లిస్టులను నియోజకవర్గం విడుదల చేశారు.. అయితే అన్ని నియోజవర్గాలలో సీట్లను విడుదల చేసిన తర్వాతే టిడిపి జనసేన నియోజవర్గ పేర్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది.. ఎందుకంటే టిడిపి పార్టీలో సీటు ఇవ్వకపోతే వైసీపీ పార్టీలో చేరిన అక్కడ కూడా సీటు ఇవ్వాలని తమ పార్టీలోనే ఉంటారని చంద్రబాబు భావనగా అనిపిస్తోంది. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నియోజవర్గ స్థాయిలో సీట్ల విషయం పైన క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: