ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల యుద్ధం మొదలైంది. మేమంతా సిద్ధం పేరుతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా ఈ యాత్ర జరుగుతుంది.నేడు మధ్యాహ్నం  ఇడుపులపాయ చేరుకుంటారు జగన్‌. వైఎస్‌ సమాధి దగ్గర ప్రార్థన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇడుపులపాయ, వేంపల్లి , వీరపునాయనపల్లి ఇంకా యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు జగన్‌ మోహన్ రెడ్డి.ప్రొద్దుటూరులో సాయంత్రం 4 గంటలకు మేమంతా సిద్దం మొదటి సభ జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సిద్ధం సభల లాగానే ఈ సభలో కూడా ర్యాంప్‌ ఏర్పాటు చేశారు.ప్రొద్దుటూరు సభకు దాదాపు లక్షా యాభై వేలమంది వస్తారని అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఇంకా నేతలు ఈ సభకు భారీగా తరలి రానున్నారు. సభలో ముఖ్యమంత్రితో పాటు కడప జిల్లా వైసీపీ అభ్యర్థులు కూడా పాల్గొంటారు.


 సభ ముగిశాక ముఖ్యమంత్రి జగన్‌….ప్రొద్దుటూరు నుండి బయలుదేరి దువ్వూరు మీదుగా కర్నూలు జిల్లా లోని ఆళ్లగడ్డ చేరుకుంటారని రాత్రికి అక్కడే బస చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28 వ తేదీన నంద్యాలలో భారీ బహిరంగ సభలో జగన్‌ పాల్గొంటారు. 29 వ తేదీన ఎమ్మిగనూరు సభలో పాల్గొంటారు.తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా నేటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఈ నెల 31 దాకా ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు ఇంకా రోడ్ షోలు సాగేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈరోజు పలమనేరు, పుత్తూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు. 28న రాప్తాడు, శింగనమల ఇంకా కదిరి సభల్లో పాల్గొటారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుంది. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట ఇంకా అలాగే శ్రీకాళహస్తి ప్రచారంలో పాల్గొంటారు. 31న కావలి, మార్కాపురం, రేపల్లె ఇంకా బాపట్లలో పర్యటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: