పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ పదే పదే వైసీపీ మీద విమర్శలు చేస్తున్న సంగతి అందరికి తెలుసు.తాను అసెంబ్లీకి రాకూడదని అసలు ఎందుకు తనపై ఇంతలా ఫోకస్ పెట్టారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తూ విమర్శించడం జరిగింది. మండలానికి పదుల సంఖ్యలో నాయకులు సిద్ధం అయ్యారని వారంతా కలసి తనను ఓడించాలని చూస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇంకా అంతే కాదు కాకినాడ పోర్ట్ వద్ద నగదుతో కంటైనర్ ని కూడా ఉంచారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు గా ఉండొచ్చు. కానీ కాపు బలిజ తెలగ జేఏసీ లీడర్ దాసరి రాము అయితే ఇవే ఆరోపణలు మళ్ళీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి వెళ్లనీయకుండా అతి పెద్ద కుట్ర జరుగుతుందని ఆయన అంటున్నారు.అంతేగాక పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఆరు వందల కోట్ల రూపాయలను ఒక్క పిఠాపురానికే తరలించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.ప్రతీ ఇంటికీ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పంచడానికి చూస్తున్నారని ఆయన మరో విమర్శ చేశారు.మండలానికి బిగ్ షాట్స్ అంతా దిగిపోయి అపుడే పోల్ మేనేజ్మెంట్ ని స్టార్ట్ చేశారని ఆయన అంటున్నారు. ఇలా ఆశపడి డబ్బులు తీసుకుని పవన్ కళ్యాణ్ ని ఓండిచవద్దు అంటున్నారు.


ఇవన్నీ పక్కన పెడితే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు పవన్ కానీ దాసరి రాము కానీ చేస్తున్నారే తప్ప ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని చర్చ నడుస్తుంది. అంతేకాదు తన మీద భౌతిక దాడులు చేయడానికి వైసీపీ నేతలు కిరాయి మూకలను రంగంలోకి దింపుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సన్నని బ్లేడ్ లతో తనను కోసేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలే నిజం అయినపుడు ఆయన ఈసీకి కదా ఫిర్యాదు చేయాల్సిందని జనాలు అంటున్నారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇక ప్రభుత్వంతో చెబితే యాక్షన్ తీసుకోదు అన్నది ఏమీ లేదు. ఈసీకి ఫిర్యాదు చేస్తే ఆరోపణలా లేక అవి నిజాలా లేక పవన్ చెప్పే సాకులా అన్నది తెల్చేస్తారు కదా అని సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.వ్యవస్థలను వాడుకొని పవన్ వైసీపీని కట్టడి చేయవచ్చు కదా అని సూచనలు జనాల నుంచి వస్తున్నాయి. అవేమీ చేయకుండా కేవలం ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఏంటని అంటున్నారు. అంటే పవన్ చేసే ఆరోపణలు నిజం కావా? ఒట్టి సాకులా? అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: