ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి రోజు రోజుకీ ముదురుతూనే ఉంది. ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అందుకు తగ్గట్టుగా వారి యొక్క అస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే ఎన్నో సర్వేలు సైతం ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి. రాష్ట్ర జాతీయస్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఇప్పుడు ఆంధ్ర ఎన్నికల పైన ఎక్కువ గా సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక సర్వే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలను చాలా ప్రకంపనలకు గురయ్యేలా చేస్తోంది.


ఇప్పటివరకు ఎక్కువ సర్వేలన్నీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడు తుందని వెల్లడించాయి. ఇప్పటివరకు జన్ మత్, లోక్పాల్,  ఆత్మసాక్షి ,పొలిటికల్ క్రెడిట్ ఇతరత్రా సర్వే సంస్థలు కూడా ఈ విషయాలను వెల్లడించాయి . ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే అంటూ ఒక సర్వే వెలుగులోకి వస్తోంది. ఒక్కో నియోజవర్గంలో దాదాపుగా 1000 మంది చొప్పున 175  స్థానాలలో ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి.. ఈ సర్వే ని విడుదల చేశారట. అయితే ఈ సర్వే మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు మాత్రమే కొనసాగినట్లు సమాచారం.


ఆ తర్వాతే ఫలితాలను విడుదల చేసింది.. వైయస్సార్సీపి పార్టీ 103 అసెంబ్లీ సీట్లను గెలవడం ఖాయమని.. 72 సీట్లు కూటమి దక్కించుకునే అవకాశం ఉంటుందట. ఇక జిల్లాల వారీ గా..
 1).శ్రీకాకుళం-6
2). విజయనగరం-7
3). విశాఖపట్నం-5
4). ఈస్ట్ గోదావరి-6
5). వెస్ట్ గోదావరి-6
6). గుంటూరు-8
7). కృష్ణ-6
8). నెల్లూరు-9
9). ప్రకాశం-8
10). అనంతపూర్-9
11). చిత్తూరు-10
12). కడప-10
13). కర్నూల్-13

వైసిపి పార్టీ 103 సీట్లతో విజయం అందుకుంటుంది అంటూ నాగన్న సర్వేలో వెల్లడించారు.. వైఎస్ఆర్సీపీ ఓటింగ్ విషయానికి వస్తే..49-51%.. కూటమి విషయానికి వస్తే 45-46% ఉంటుందని.. కాంగ్రెస్ కి ఒక్క పర్సంటే.. ఇతరులకు..2.5-3.5% ఓటింగ్ ఉంటుందంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: