పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి amarnath GUDIVADA' target='_blank' title='గుడివాడ అమర్‌నాథ్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గుడివాడ అమర్‌నాథ్‌ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లలో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. వైసీపీకి చాలామంది గొంతుకగా అందిస్తే అందులో ఒకరిగా నిలిచారు. పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని చెప్పిన అతికొద్ది మంది వైసీపీ నాయకుల్లో ఈయన ఒకరు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ధీమా వ్యక్తం చేశారు. మరి ఆయన గాజువాకలో గెలుస్తారా?

ఈసారి 80 శాతానికి పైగా ఓట్ల నమోదయ్యాయి. అయితే రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వైఎస్సార్సీపీకి ఓటు కచ్చితంగా వేసి ఉంటారని amarnath GUDIVADA' target='_blank' title='గుడివాడ అమర్‌నాథ్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గుడివాడ అమర్‌నాథ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేత ఎన్నికల ప్రచారం సమయంలో ఇంటింటికీ తిరుగుతూ గాజువాక ప్రజలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వారి బాగోగులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ఎందుకు ఓటేయాలో టీడీపీ కూటమికి ఎందుకు ఓటు వేయకూడదో వివరించి చెప్పారు ఆయనకు నియోజకవర్గం లో మంచి స్పందన లభించింది.

2019 ఎన్నికల్లో అమర్‌నాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత, ఎన్డీయే కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. పల్లా శ్రీనివాసరావు, అమర్‌నాథ్ మధ్య పోటీ ఏమీ ఉండదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమర్‌నాథ్ వైసీపీ హయాంలో బాగానే పని చేశారని, ఆయన పని పట్ల సంతృప్తిగా ప్రజలు ఉన్నారని టాక్ నడుస్తోంది.

అలాగే సంక్షేమ పథకాలు కారణంగా ప్రజలు వైసీపీకి రెండు ఆలోచన లేకుండా ఓట్లు వేశారని తెలుస్తోంది. జగన్ ఐదేళ్లలో చేసిన ఎన్నో అభివృద్ధి కారణంగా ఆయనను చూసి వైసిపికి ఓట్లు వేసిన వారు అనేకమంది అభ్యర్థుల గెలుపుకు కారణం అవుతారు. వారిలో గుడివాడ అమర్‌నాథ్ ఉంటారని నమ్ముతున్నారు. 2014లో పల్లా శ్రీనివాసరావు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచారు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: