ఈ తంతంతా దేనికంటే అక్కడే వుంది అసలు విషయం. ఒకప్పుడు చంద్రబాబుని హైదరాబాద్ కి రోల్ మోడల్ గా చూసిన సో కాల్డ్ నాయకులు, కార్యకర్తలు ఆ విషయాన్ని ఇపుడు మరిచారు. విషయం ఏమిటంటే... ప్రస్తుతం తెలంగాణాలో అక్కడక్కడా పసుపు జెండాల రెపరెపలు షురూ అయ్యాయి. చంద్రబాబు ఫ్లెక్సీలు, బ్యానర్లు కొన్ని చోట్ల కొలువు దీరాయి. చంద్రబాబు ఏపీ సీఎంగా తాజాగా 4వ సారి ఎన్నిక కావడంతో టీడీపీ వర్గాలు పండగ చేసుకున్నాయి. ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ళ పాటు నాన్ స్టాప్ గా పాలించిన ఘనత ఆయనిది. అలాంటపుడు బాబు ఫ్లెక్సీలు అక్కడ ఉండకూడదా? అనే చర్చ ఇపుడు తెలంగాణాలో సాగుతోంది.
నిన్న మొన్నటి వరకు అక్కడ కెసిఆర్ సామ్రాజ్యం నడిచేది. కాబట్టి బాబుకి అంత స్కోప్ ఉండేది కాదు. ఇపుడు తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ - టీడీపీకి ఇక్కడ కొంత వెసులుబాటు కలదు. దాంతోనే బాబు ఫ్లెక్సీలు బ్యానర్లూ అంటూ హడావుడి మళ్లీ మొదలైంది. అయితే ఇది అంతవరకూ బాగానే ఉందిగానీ కొంతమంది సో కాల్డ్ తెలంగాణ వాదులకు, మేధావులకు నచ్చడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. అవును, చంద్రబాబు టీడీపీని పూర్తిగా అంధ్రా పార్టీగా భావిస్తూ వస్తున్న తెలంగాణావాదులు మాత్రం హైదరాబాద్ గడ్డ మీద బాబు ఫ్లెక్సీల హడావుడి ని చూసి మండిపోతున్నారు అని వినికిడి. మరి దీనిపైన రేవంత్ రెడ్డి, బాబులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి