సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విమర్శలు కాస్త తక్కువగా ఉన్న రాజకీయాల్లో మాత్రం ఇలాంటి విమర్శలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక ఇలా సీనియర్ రాజకీయ నాయకుల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువకులు ఇక ప్రసంగాలలో తడబడ్డారు అంటే.. ఇక వారిని ప్రత్యర్థి పార్టీలో ఎంతలా ఆడేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఇక రాజకీయ ఉద్దండుడిగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు వారసుడిగా అటు ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లో చదవడం కారణంగా.. తెలుగులో ప్రసంగాలు ఇవ్వడం నారా లోకేష్ కి మొదట్లో కష్టమైంది. అంతేకాదు సబ్జెక్టు పై పెద్దగా నాలెడ్జ్ కూడా లేకపోవడంతో ఎప్పుడు తడబాటుకు గురవుతూ ఉండేవారు. కొన్ని కొన్ని సార్లు ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెబుతూ ఉండేవారు.
అయితే ప్రత్యర్థి పార్టీలు ఇక లోకేష్ మాటలను టార్గెట్ గా చేస్తూ ఎన్నోసార్లు విమర్శలు గుప్పించాయి. అంతెందుకు ఏకంగా సొంత పార్టీ నేతలే చంద్రబాబు లాంటి మహానాయకుడి వారసుడు ఇలా ఉన్నాడు ఏంటి అంటూ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. దీంతో ఇక లోకేష్ మాటలు చూసి పప్పు పప్పు అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు అవమానించడం మొదలుపెట్టారు. లోకేష్ ఏ ప్రసంగంలో మాట్లాడిన అతని మాటలలో తప్పులను వెతుకుతూ మరి ఇక విమర్శనాస్త్రాలు గుప్పించారు. అంతెందుకు సోషల్ మీడియాలో కూడా ఎన్నో రోజుల పాటు పప్పు అంటూ వెతికితే లోకేష్ పేరు రావడం కూడా జరిగింది.
ఇలా పప్పు పప్పు అని ప్రత్యర్థి పార్టీలు ఎంతల అవమానించినా.. అటు లోకేష్ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండానే ముందుకు సాగారు. ఇక సబ్జెక్టు పై మరింత అవగాహన పెంచుకొని.. ఇక ఇప్పుడు పదునైన ప్రసంగాలు ఇస్తున్నారు. ఒకప్పుడు పప్పు అని విమర్శించిన నోళ్లే ఇక ఇప్పుడు మారిన లోకేష్ ని చూసి ఫీదా అవుతున్నారు. పప్పు అన్నోడే పదునైన కత్తిలా మారాడు అని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం చంద్రబాబుకు అసలు సిసలైన వారసుడు లోకేష్ అంటూ తెలుగు తమ్ముళ్లు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఎన్నడు గెలవని మంగళగిరిలో.. భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో చూపించి అసెంబ్లీలో అడుగు పెట్టి ఏకంగా ఐటి మినిస్టర్ గా మారాడు నారా లోకేష్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి