"ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిజాయితీ, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం మరువలేనివి. ఆయన దీర్ఘాయుష్షుతో పాటు విజయవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను" అని బాబు విష్ చేశారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో పవన్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు.
"చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడు, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు." అని కూడా బాబు తన శుభాకాంక్షలు ప్రత్యేకంగా నొప్పి చెప్పారు ఇప్పుడు అదే చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలోని పెద్ద సక్సెస్ అయ్యిందా పెద్ద హీరోయిన్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్నారని బాబు చెప్పకనే చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలైన ఉద్దేశాన్ని, మనసును అర్థం చేసుకున్నారు.
ఇకపోతే ఇది ప్రత్యేక సందర్భం అయినప్పటికీ, బాబు ఈరోజు పవన్‌ని కలవకపోవచ్చు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలకు సంబంధించిన తెరవెనుక పనుల్లో పవన్ కూడా బిజీగా ఉన్నారు. పవన్ చాలా నిజాయితీపరుడు, తిరుగులేని హీరో అని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరదలు భారీ ఎత్తున రావడం వల్ల ఏపీ ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు విజయవాడ ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తన పుట్టినరోజును అంత గ్రాండ్ గా జరుపుకోలేకపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి