పహల్గాం ఉగ్రదాడిలో భారతీయులు 28 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనిపై ప్రస్తుతం భారత్ పగ తీర్చుకునే పనిలో ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధాన్ని ప్రారంభించి విజయం సొంతం చేసుకుంది. దీనిపైన భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రస్తుతం కేఏ పాల్ భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానని ఇటీవల ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

రీసెంట్ గానే అమెరికాకు వెళ్లి పెద్ద నేతలు అందరినీ కలిశానని యుద్ధం ఆపగలిగే శక్తి నాకు మాత్రమే ఉందని కేఏ పాల్ చెప్పారు. అందుకే శనివారం ప్రధాని నరేంద్రమోదిని కలిసి ఆదివారం రోజున పాకిస్తాన్ వెళుతున్నానని అన్నాడు. ఈ దేశాలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. టెర్రరిస్ట్ క్యాంప్ లను మాత్రమే భారత్ టార్గెట్ చేసిందని పాల్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ వద్దని మొరపెట్టుకున్నానని పాల్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి రెండు నెలలు సమయం ఇస్తున్నాను.

RDT సంస్థకు తిరిగి FCRA తీసుకురావాలి లేకపోతే ప్రపంచాన్నే దించుతానని అన్నారు. యుద్ధాన్ని ఆపడానికి ఇప్పటికే కేంద్రంలోని 2.నెంబర్ తో కలిసి మాట్లాడానని అన్నాడు. రాయలసీమ నుంచి అనేకమంది సీఎంలు అయినా ఈ ప్రాంతానికి ఏం చేయలేకపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై కూడా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అసలు క్రిస్టియన్ వ్యక్తి కాదని చిన్న జీయర్ స్వామి భక్తుడు అని వెల్లడించారు. జగన్ ఏపీలో ఓడిపోవడానికి గల కారణం అతడు నా ఆశీర్వాదం తీసుకోలేదు. అందుకే అతను చిత్తుగా ఓడిపోయాడని కేఏ పాల్ అన్నాడు. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: