ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన మంత్రి 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంద‌ని టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అన్నింటికి మించి లోకేష్‌కు మోదీ ఏకంగా మూడు గంట‌ల టైం ఇవ్వ‌డంతో పాటు క‌లిసి డిన్న‌ర్ కూడా చేశారు. చాలా విష‌యంలో మోదీ లోకేష్‌తో చ‌ర్చించారు. లోకేష్‌కు మోదీ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలోనే కాదు.. అటు తెలంగాణ రాజ‌కీయాల్లోనూ చర్చ‌నీయాంశ‌మైంది


ఇక తాజా భేటీలో 2024 ఎన్నికలకు ముందు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ ‌లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి‌ బాటలు వేసింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి, పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ  సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.


అంతేకాకుండా, జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 2047  వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: