
ఇటీవల కొడాలి నాని పైన అనేక కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో నేపథ్యంలో అరెస్టు చేస్తారన్న సమయంలోనే..... కొడాలి నాని కి గుండెపోటు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే ఆయనను హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ దాదాపు నాలుగు రోజులు.... చికిత్స తీసుకున్న తర్వాత ముంబై వెళ్తున్నట్లు ప్రకటించారు. శస్త్ర చికిత్స కోసం ముంబైకి కొడాలి నాని తరలించినట్లు ఇటీవల ప్రకటించారు.
ఈ సందర్భంగా కొడాలి నాని కి దాదాపు పది గంటలపాటు శస్త్ర చికిత్స చేసినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ గుండె ఆపరేషన్... అయిపోయిన తర్వాత కూడా ఏపీకి రాలేదు కొడాలి నాని. అమెరికాకు వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్త రాగానే ఆన్లైన్ ద్వారా కొడాలి నాని కి నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ రెస్పాండ్ కాలేదు కొడాలి నాని. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలు అలాగే పోర్టులకు లుక్ అవుట్ నోటీసులు వెళ్లాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు