
ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న రైతు కుటుంబాలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందడానికి అర్హత కలిగి ఉంటారు. వెబ్ ల్యాండ్ ఆధారంగా ఇప్పటికే మండల స్థాయిలో లబ్ధిదారుల వివరాలను అధికారులు సేకరించారు. అయితే ఈ స్కీమ్ డబ్బులు పొందడానికి అర్హత ఉందా లేదా తెలుసుకోవాలంటే రైతు సేవా కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. అయితే సెల్ ఫోన్ ద్వారానే సులువుగా ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు అర్హత ఉందో లేదో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అందులో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ను ఎంచుకుని ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఎం.ఏ.వో అప్రూవల్ ఉందో లేదో తెలుస్తుంది. అందులో అప్రూవ్డ్ అని ఉంటే ఈ పథకం కింద అర్హత పొందినట్టేనని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ అర్హతకు రీసర్వే చిక్కులు తెచ్చి పెడుతోందని తెలుస్తోంది.
గత ప్రభుత్వం సర్వే నంబర్ల స్థానంలో ల్యాన్డ్ పార్సిల్ మ్యాప్ లను తీసుకొనిరాగా రీ సర్వే తర్వాత నలుగురైదుగురికి కలిపి ఒకే ఎల్.పీ.ఎం కేటాయించిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమాచారం అందుతోంది. రీసర్వే చేసిన గ్రామాల్లో ఆధార్ నంబర్లు సరిగ్గా ఉండటం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్న ప్రతి రైతు పథకానికి సంబంధించిన ప్రయోజనాలు పొందేలా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.