గడిపిన రెండు రోజుల క్రితం తన అరెస్టు పైన జగన్ డైరెక్ట్ గానే ఓపెన్ ఆఫర్ ఇచ్చేలా తెలియజేశారు. తనని అరెస్టు చేయాలంటే తన నివాసానికి వచ్చి తీసుకుపోవాలని తాను విజయవాడలోనే ఉన్నానంటూ సిట్ కు హింట్ ఇవ్వడం జరిగింది. అలా ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్టు చేయలేకపోతోందట. ముఖ్యంగా జగన్ ని అరెస్టు చేయాలి అంటే బిజెపి నుంచి మద్దతు ఉండాలి. ప్రస్తుతం ఏపీలో అయితే టిడిపి ,బిజెపి, జనసేన పార్టీలతో భాగస్వామిలతో ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అన్ని పార్టీలతో చర్చించే నిర్ణయాలు తీసుకోవాలి. అయితే టిడిపి జగన్ అరెస్టు చేసి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ అందుకు జనసేన పార్టీ కూడా సహకరిస్తున్న బిజెపి మాత్రం అందుకు ఒప్పుకోలేదట. వైసిపి పార్టీని బిజెపి వదులుకొనే అవకాశాలు కనిపించడం లేదు.
కేవలం టిడిపి, జనసేన కేడర్ మాత్రమే జగన్ అరెస్టు చేయాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం 2024 ఎన్నికలలో జగన్ ఓటు పర్సంటేజ్ 40% ఉంది.. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదని పెద్దలు భావిస్తున్నారు..ఒకవేళ జగన్ అరెస్ట్ అయ్యి బయటికి వచ్చారంటే కచ్చితంగా ఈసారి సీఎం గా అవుతారని టిడిపిలో కొంతమంది పెద్దలు ఆలోచిస్తున్నారట. అయితే లిక్కర్స్ స్కామ్ లో కొంతమంది వైసీపీ నేతలను అరెస్టు చేసి..జగన్ ను అరెస్టు చేయకపోతే కూటమి ప్రభుత్వాన్ని తప్పు పడతారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులను చూస్తూ ఉంటే జగన్ ని అరెస్ట్ చేసే ధైర్యం కూటమి ప్రభుత్వం చేయలేకపోతుందనే విధంగా వాదన వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి