కడప వేదికగా టిడిపి మహానాడు సభను చాలా సంబరంగా టిడిపి నేతలతో పాటు కార్యకర్తలు  నిన్నటి రోజు నుంచి జరుపుకుంటున్నారు. అయితే ఈ పసుపు పండుగ పైన మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహానాడు అనేది ఒక పెద్ద డ్రామా అని రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి ఈ పని చేశామని టిడిపి నేతలు ధైర్యంగా చెప్పగలరా అంటే ప్రశ్నించారు.. వాళ్లు చెప్పిన మేనిఫెస్టో, కరపత్రాలు, బాండ్లు సైతం ప్రతి ఇంట్లో ఇప్పటికే ఉన్నాయి సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయో అంటూ ప్రజలే నిలదీస్తున్నారని తెలిపారు.


మహానాడు సభలో చంద్రబాబు కేవలం ఫోజులు ఇస్తున్నారు..టిడిపి తెలుగు డ్రామా పార్టీగా మారిపోయిందని సత్తా అంటే కడపలో మహానాడు చేయడం కాదు ఇచ్చిన హామీలను  నెరవేరిస్తే నిజమైన సత్తా అవుతుంది అంటు తెలియజేశారు.. మహానాడు సభలో కూడా జగన్ ను తిట్టడం కూడా సత్తా అవుతుందా అంటు ప్రశ్నించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత  అనేవి ఉండాలి.. వాటన్నిటిని చంద్రబాబు బ్రష్టు పట్టించారంటు మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.


ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వారందరిని ప్రలోభాలు పెట్టి బెదిరించి భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. కరోనా వంటి సమయాలలో కూడా ఆదాయాలు తగ్గినా ,ఖర్చులు పెరిగి తీవ్ర సంక్షేమం ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఎలాంటి సాకులు చెప్పకుండా ప్రజలకు చేయవలసిన మేలు చేశానని ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజల సంతోషమే కోరుకున్నామని ఎన్నికల ఇచ్చిన ప్రతి హామీను కూడా నెరవేర్చాము.. వైసీపీ పార్టీ 99% హామీలను అమలు చేసాము అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాము.. అంటు తెలిపారు. సూపర్ సిక్స్ హామీలంటూ ఏవేవో చెప్పి ప్రజలను మోసం చేసింది కూటమి ప్రభుత్వము అంటు ఎద్దేవా చేశారు మాజీ సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: