సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో విభేదాలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. అయితే ఆ తర్వాత మళ్లీ అవి చల్లారుతూ ఉంటాయి. ముఖ్యంగా రక్త బంధం, తోడబుట్టిన బంధం వంటివి ఎప్పుడో ఒకసారి కలవాల్సిందే. అటు పొలిటికల్ పరంగా వెళితే.. నారా, నందమూరి కుటుంబంతో పాటు వైయస్సార్ ఫ్యామిలీ లో కూడా ఇలాంటివి ఇబ్బందులు ఉన్నాయి. గడిచిన కొన్ని నెలల  క్రితం అటు చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కూడా కలిసిపోయాయి. అయితే ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఆయన సోదరి షర్మిల మధ్య విభేదాలు తలెత్తయని వార్తలు కూడా వినిపించాయి.


అలా షర్మిల 2021లో తెలంగాణలో ఒక పార్టీని స్థాపించింది. అయితే అది చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఆ తర్వాత ఏపీకి వచ్చిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మారింది. వైసీపీలో కొన్ని  స్థానాలు ఓడిపోవడానికి కారణమయ్యిందని కూడా చెప్పవచ్చు. అలా జగన్ వర్సెస్ షర్మిలగా కూడా  రాజకీయాలు కొన్ని నెలల పాటు వాడివేడిగా కొనసాగాయి. కానీ షర్మిల విషయంలో మాత్రం జగన్ ఎక్కడా కూడా పెద్దగా విమర్శలు చేయలేదు.. అయితే ఆస్తి విషయంలో మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కోర్టు మెట్లు ఎక్కారనే విధంగా కూడా వార్తలు వినిపించాయి.


షర్మిల ,జగన్ మధ్య విభేదాలు కూటమి ప్రభుత్వానికి బలంగా మారుతున్న వేళ..సడన్గా ఇప్పుడు ఒక విషయం తెరమీదకి వచ్చింది.. జగన్, షర్మిల మధ్య రాజి కుదురుతోందేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే షర్మిలకి సంబంధించి ఒక న్యూస్ సాక్షి పేపర్లో కనిపించింది.ఇటీవలే వైయస్ రాజారెడ్డి జయంతి వేల షర్మిల ఇడుపులపాయకి వెళ్ళింది. అక్కడ పాల్గొన్నప్పుడు ఆమె మీద సాఫ్ట్గానే రాశారట. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య కూడా రాజీ చర్చలు కొనసాగుతున్నాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు అంటూ కార్యకర్తలు కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: