ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే పోలీసులు నడిరోడ్డు మీద ముగ్గురు యువకులను దారుణంగా కొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ అంతట వ్యాపించింది.తెనాలిలో ఏదైతే పోలీసులు నడిరోడ్డు మీద ముగ్గురిని కొట్టినటువంటి వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. వాళ్లకు సంబంధించి పోలీసులు కావాలని చేశారన్నట్లుగా వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్ ఇందులో కథ నడిపించారన్నటువంటి పాయింట్ ను హైలెట్ చేస్తూ.. అతని వ్యక్తిగత కక్ష అని తీర్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంగా చేశారని ఓవరాల్ గా ఈ ఇష్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. వైసిపి పార్టీ ఈ విషయాన్ని తెలియజేస్తోంది.



తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది అన్నటువంటి పాయింట్ ను రైజ్ చేస్తూ.. ఐతానగర్ లో జరిగినటువంటి  సంఘటనలో వాళ్ల తప్పు చేశారా ఒప్పు చేశారా అనవసరం.. అది చట్టం కోర్టులు వంటివి చూసుకుంటాయి.. కానీ పోలీసుల చర్యలు సహించేది లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి మూడో తారీకు రోజున తెనాలికి వెళ్ళబోతున్నారట. ఐతా నగర్ లో జరిగినటువంటి సంఘటనలో బాధితులుగా ఉన్న కుటుంబాలను కూడా పరామర్శించడానికి వెళ్లబోతున్నట్లు తెలియజేశారు. పోలీసుల తీరుని ప్రజలకు తెలియజేస్తానంటూ తెలియజేశారు. ఇప్పటికే ఈ ఘటన జరిగిన తర్వాత కొంతమంది అధికారులను కూడా ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది.


ఇక రేపటి రోజున జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ ఉదయం 9: 30 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్లబోతున్నారు. అలా పరామర్శించి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరిగి మళ్లీ తాడేపల్లికి చేరుకోబోతున్నట్లు వైఎస్ఆర్సిపి ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ముగ్గురు యువకులకు బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టుగా పోలీసులకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది.. అయితే ఈ వీడియో పైన ఇప్పటికే దళిత, మైనారిటీ సంఘాలు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.ముఖ్యంగా తమ మీద తప్పుడు కేసులు బనాయించారంటూ న్యాయపోరాటానికి దిగుతామంటూ కూడా తెలియజేశారు. మరి జగన్ ఎంట్రీ తో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: