గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడు ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటారు. బిజెపిలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి రాజాసింగ్ ముక్కు సూటిగా మాట్లాడతారు. అయితే తాజాగా ఆయన తన సొంత పార్టీ నాయకుల పైన విమర్శలు చేసి వారి బండారం బయటపెడతానని హెచ్చరించాడు. అయితే రాజా సింగ్ కు బిజెపి నుండి నోటీసులు వచ్చాయని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తనను బీజేపీ పార్టీ సస్పెండ్ చేస్తే  తెలంగాణలో  పార్టీకి ఎవరు నష్టం చేస్తున్నారు. వారి బాగోతం మొత్తం బయటపెడతానని తెలియజేశారు. సొంత పార్టీ నాయకులే పార్టీని మోసం చేస్తూ  అధికారంలోకి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. బిజెపిలో ఉన్న దొంగలంతా ఒక్కటైపోయారని తెలియజేశారు.


నాపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని అన్నారు.   అంటే ఇన్ డైరెక్ట్ గా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ రాజా సింగ్ మాట్లాడారు. ఈయనే కాకుండా రాష్ట్రంలో మిగతా బీజేపీ నేతలు అంతా పనిగట్టుకుని నాపై ఆరోపణలు చేస్తున్నారని, పార్టీకి నష్టం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. నాకు నోటీసులు పంపించి పార్టీ నుంచి తీసేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అలాంటి పని జరిగితే మాత్రం, తెలంగాణ బిజెపి నాయకుల బండారం అంతా బయట పెడతానని అన్నారు. అయితే ఆదివారం రాజాసింగ్ కు  మంగళహాట్ పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు వచ్చాయి.

ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్న తరుణంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం సెక్యూరిటీతో ఉండాలని నోటీసుల్లో తెలియజేశారు. రాజాసింగ్ భద్రత దృష్ట్యా  ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 1+4 భద్రతను కూడా కేటాయించింది. కానీ రాజాసింగ్ ప్రభుత్వం అందిస్తున్న భద్రతను అస్సలు వినియోగించుకోవడంలేదని తనకు నచ్చినట్టే ఆయన తిరుగుతున్నారని సెక్యూరిటీ లేకుండానే బయటకు వస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఇలా నడుస్తున్న తరుణంలో ఆయన బిజెపి నాయకులపై  మండిపడడం రాష్ట్ర  వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: