
గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది అని ప్రముఖ సినీ నటుడు .. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది... అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరికొంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఈ ప్రమాదంలో మన భారతీయులతో పాటు విదేశీయులూ ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరం. ఈ జాతీయ విపత్తు సమయంలో దేశం మొత్తం ఒక్కటై బాధిత కుటుంబాలకు మానసిక బలం అందించాలి. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను . . . ఈ వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని తెలిపారు. ఇక అహ్మాదాబాద్ లోని సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి గురువారం 242 మంది ప్రయాణికులతో లండన్ బయలు దేరిన విమానం .. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలి పోయిన సంగతి తెలిసిందే. ఇందులో 169 మంది భారతీయులు .. 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు