మాజీ సీఎం వైయస్ జగన్ సత్తెనపల్లిలో నిన్న ఒకింత ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో వైసిపి అధికారంలోకి వస్తుందని ఆ సమయంలో ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదలనంటూ జగన్ ఒకింత షాకింగ్ కామెంట్లు చేశారు. తమ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసుల గురించి సైతం జగన్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఆవేశం వెనుక కారణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జగన్ లో గతంలో ఎప్పుడూ కనిపించని కసి, ఆవేశం కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా సైతం అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జగన్ ను తీవ్ర మనోవేదనకు గురిచేశాయని అందుకే జగన్ ఈ విధంగా రియాక్ట్ కావాల్సి వచ్చిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జగన్ కు సొంత కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉండటంతోపాటు వైసిపి నేతల అరెస్టులు పార్టీకి తీరని నష్టం చేస్తుంది.

కొంతమంది వైసిపి నేతలు ఎలాంటి తప్పు చేయకపోయినా అరెస్టయ్యారని సోషల్ మీడియా వేదికగా సైతం కామెంట్లు వినిపిస్తున్నాయి. విపరీతమైన ఆగ్రహంతో జగన్ చేసిన కామెంట్లు ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఇతర నేతలకు భిన్నంగా అడుగులు వేస్తున్న జగన్ భవిష్యత్తులో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.

ఒకింత ధైర్యంతో జగన్ కామెంట్ చేయగా జగన్ చేసిన కామెంట్లు వైసిపి నేతల్లో సైతం జోష్ నింపుతున్నాయి. భవిష్యత్తులో మళ్లీ అధికారం దక్కించుకోవడం పక్కా అని అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సైతం జగన్ ఇదే దూకుడును కొనసాగిస్తే మాత్రం పొలిటికల్ పరంగా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. మాజీ సీఎం జగన్ ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా తెలివైన వ్యూహాలతో అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: