
సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి భారీ షాక్ తగిలిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ను ఇబ్బంది పెట్టాలన్న ప్రభుత్వానికి ఊహించని విధంగా బ్రేక్ పడిందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ పర్యటన సమయంలో ప్రాణాలు కోల్పోవడం ఒకింత సంచలనం అయింది.
మొదట జగన్ కాన్వాయ్ కు సింగయ్య మృతికి ఎలాంటి సంబంధం లేదని వార్తలు వినిపించినా ఆ తర్వాత మాత్రం పరిస్థితులు వేగంగా మారిపోయాయి. అయితే జగన్ కాన్వాయ్ కింద సింగయ్య పడినట్టు వైరల్ అవుతున్న వీడియోను పోలీసులు సోషల్ మీడియా నుంచి డౌన్ లోడ్ చేశారని తెలుస్తోంది. అయితే ఏఐ వాడి ఈ వీడియోను క్రియేట్ చేశారనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదానికి కారణమని కారులో ప్రయాణిస్తున్న వారిపై కూడా కేసులు పెట్టడంపై హైకోర్టు గతంలో విస్మయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజులలో జగన్ ఈ కేసు నుండి పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలియాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు