
అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా చేపట్టాలి. ప్రతి హైస్కూల్ కి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ను పునర్ వ్యవస్థీకరించి నిపుణులను భాగస్వామ్యం చేయాలని, త్వరలోనే బోర్డ్ మీటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ATL) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమర్థవంతంగా స్టెమ్(STEM) యాక్టివిటీస్ చేపట్టాలని ఆదేశించారు.
హైస్కూల్ ప్లస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు
రాష్ట్రంలో హైస్కూల్ ప్లస్ ల పనితీరుపై సమగ్రంగా చర్చించారు. హైస్కూల్ ప్లస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలపై మంత్రి ఆరా తీశారు. అక్షర ఆంధ్ర(అఆ) కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయనున్న స్పోర్ట్స్ కిట్ ను మంత్రి పరిశీలించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు