
ఎప్పుడూ కూడా టిడిపి పార్టీకి అపోజిషన్ పార్టీ మీదే గురిపెట్టే రాధాకృష్ణ.. గత కొంతకాలంగా టిడిపి కూటమి ప్రభుత్వ విధానాల పైన కూడా గట్టిగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు బలహీనతలను కూడా బయటపెడుతున్నారు. P4 పథకం మీద అలాగే ఎమ్మెల్యేల దందా మీద చేసిన విశ్లేషణ ఇప్పుడు కూటమి వర్గాలలో పెద్ద సంచలనాన్ని రేపుతోంది.. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానంటూ సీఎం చంద్రబాబు చెబుతూ ఉన్నప్పటికీ p4 కాన్సెప్ట్ తీసుకురాగా దీని మీద రాధాకృష్ణ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ పథకం పూర్తిగా ఆచరణ సాధ్యం కాదని.. ఈ పథకంలో బంగారు కుటుంబాల పేరుతో నిరుపేదలను సైతం ఎంపిక చేసే విషయంలో మొదటి నుంచే తప్పులు తడాఖా ఉందంటూ తెలిపారు.
ఇప్పటిదాక ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల మంది బంగారు కుటుంబాలకు ఎంపిక కాగా.. అందులో 26% మంది అనర్హులుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మరొకవైపు మార్గదర్శకాలను దత్తత పేరుతో చాలా బలవంతం చేస్తున్నారనే ఆరోపణలు కూడా తెలియజేశారు.. సేవ చేసే వారికి ఇలాంటి బలవంతాలు ఏంటి అంటూ నిలదీశారు...అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పేదలు ఉన్నారో ఏదైనా ఒక స్పష్టత ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు. వీటికి తోడు తెల్లారేషన్ కార్డుదారులు పేదరికానికి సాక్ష్యం అనుకుంటే కోటికి పైగా కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని తెలిపారు.. అలాంటిది కేవలం 11 లక్షల మందిని పేదలుగా నిర్మూలిస్తే మిగిలిన 89 లక్షల పరిస్థితి ఏంటి అంటూ కూటమి ప్రభుత్వం పైన వీరంతా అసంతృప్తి గానే ఉంటారు కదా అంటూ రాసుకొచ్చారు.
పేదరికం లేని సమాజం అన్నది ప్రకృతి విరుద్ధమంటూ తెలియజేశారు.. సంక్షేమ పథకాలు అనేవి అమలు చేస్తేనే ప్రజలు ఓటు వేయడానికి ఆలోచిస్తారు అంటూ హెచ్చరించారు. మరి ఈనెల 19న ప్రారంభమయ్యే P4 పథకం మీద మళ్లీ సమీక్షించుకోవాలి అంటూ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేలు దారుణంగా మారిపోయారని రాసుకొచ్చారు.. వైసీపీ ఎమ్మెల్యేలను మించి అరాచకం చేస్తున్నారని విధంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తువున్న కూటమి నాయకుల పరిస్థితి ఏంటి అన్నది వెంటనే తెలుసుకోవాలంటే తెలిపారు.