ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అన్నీ మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో మహిళలపై పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా కుటుంబం డెవలప్ అయ్యేలా ఆలోచన చేస్తున్నారు. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే ఫ్రీ బస్సు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకం సక్సెస్ అయింది. ఇదే పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే మొదటి సంతకం మహిళలకు ఉచిత బస్సు పథకంపై  క్యాబినెట్ ఆమోదం తెలిపి సంతకం పెట్టేసింది. రాష్ట్రంలోని మహిళలంతా ఎక్కడికి వెళ్లినా ఫ్రీగా ప్రయాణం చేస్తూ సంబరపడిపోతున్నారు. ఇదే తరుణంలో ఈ పథకాన్ని మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా నేడు ప్రారంభించబోతున్నారు.  

సూపర్ సిక్స్ హామీల్లో ఉన్నటువంటి ఈ పథకం  మొక్కుబడిగా జిల్లాల వారీగా అమలు చేయకుండా రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసిన ఫ్రీగా వెళ్లేలా అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు చేకూరాలని ఉంది. నిత్యం ఉద్యోగ ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి చార్జీల భారం తగ్గుతుంది. అంతేకాదు బస్సుల్లో వెళ్లి చదువుకునే విద్యార్థులకు కూడా రాకపోకలు ఫ్రీగా ఉండడం వల్ల కుటుంబాలపై భారం తగ్గుతుంది. అలాగే కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసినా కానీ చార్జీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా శ్రీశైలం, అన్నవరం,తిరుపతి, ద్వారకా, సింహాచలం, శ్రీకాళహస్తి,విజయవాడ వంటి ఆలయాలకు వెళ్లాలన్నా స్త్రీలకు  టికెట్టు లేకపోవడం వల్ల ఈజీగా ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకొని వస్తుంటారు.

 ఈ విధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు 4000 వరకు మిగులుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ పథకం అమలు చేస్తే ఏటా ప్రభుత్వం పై 1942 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు. అలాగే ప్రతిరోజు దాదాపు 27 లక్షల మంది మహిళలు ఈ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటారని అంచనా వేశారు. అయితే ఈ పథకంలో టికెట్ పై చార్జీ ఉన్నా కానీ డబ్బులు తీసుకోరు. జీరో టికెట్ పేరుతో టికెట్ జారీ చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి వాటిల్లో మాత్రమే చెల్లుతుంది. ఈ పథకం ద్వారా మహిళల నుంచి  టీడీపీ కూటమి కి ఎంతో సపోర్ట్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: