సామాన్య,మధ్యతరగతి కుటుంబాలలో బంగారం కొనాలి అంటే పెద్ద గుదిబండలా మారింది. ఏడాది క్రితం 10 గ్రాముల తులం బంగారం రూ .78,000 ఉండగా.. తాజాగా అదే బంగారం ఇప్పుడు రూ. 1.30 వేలకు చేరింది. అంతలా పెరిగిపోవడంతో సామాన్యులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీయంగా పసిడి ధర 67% పైగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో కేజీ వెండి ధ రూ. 89,000 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ. 1.85 లక్షలకు చేరింది అంటే సుమారుగా 107% వరకు ధర పెరిగిపోయింది. మరో రెండు మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కాబట్టి కొనుగోలుదారులు కొనాలి అంటే భయపడేలా చేస్తున్నాయి ధరలు.


15 ఏళ్ల క్రితం గృహప్రవేశాలు, వోణి ఫంక్షన్స్, బారసాల వంటి కార్యక్రమాలకు బంగారం వెండి వంటివి కొన్ని సందర్భాలలో గిఫ్టులుగా ఇచ్చేవారు. ఇప్పుడు వెండి బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో  ఐదు నుంచి పాతికవేల రూపాయల వరకు చదివించే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా గోల్డ్ ధరలు ,వెండి ధరలు భారీగా పెరగడంతో బిజినెస్ కూడా అంతంత మాత్రమే నడుస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు గోల్డ్ షాప్ ఓనర్స్.ఇ ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగి గుదిబండల మారబోతున్నాయట.


అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి అధికారంలోకి రావడంతో టారిఫ్ వార్ ప్రపంచవ్యాప్తంగా  చాలా ఒడిదుడుకులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి తోడు పచ్చిమాసియాలో బగ్గుమన్న ఉద్రిక్తత వల్ల బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్టుగా అయింది. దీంతో సురక్షిత పెట్టుబడి అంటూ  బంగారం వైపు చాలామంది అడుగులు వేశారు. అంతర్జాతీయంగా ఔన్స్ 2,600 డాలర్లు ఉండగా ఇప్పుడు 4,190 డాలర్లు ఆల్ టైం గరిష్టానికి తాకింది.. అంటే సుమారుగా 10 నెలలలోనే 61 శాతానికి పెరిగిపోయింది.


అలాగే అమెరికా, చైనా టారిఫ్ యుద్ధం వల్ల బంగారం మరింత పెరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ప్రపంచ దేశాలు డాలర్లలో పెట్టుబడులు పెట్టకుండా, బంగారం పైన నిల్వలు ఉంచడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉండే సెంట్రల్ బ్యాంకులలో ఏటా 800 టన్నులు  బంగారం కొనుగోలు చేస్తున్నారట. ఇలా సరఫరా కూడా మందగించడంతో బంగారం డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

ఇలా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగిపోతూ ఉంటే డాలర్ తో రూపాయి విలువ అంతకంతకు పడిపోతూ పసిడి ధరలను మరింత పెరిగేలా చేస్తోంది. గడిచిన మూడెళ్ల క్రితం డాలర్ రూపాయి మారక విలువ 80 ఉండగా ఇప్పుడు ఏకంగా 88.82 కనిష్టానికి పెరిగిపోయింది. ట్రంప్ అధికారంలో ఉన్నంతకాలం  ఈ ఒడిదుడుకులకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. బంగారం ధరలపైన విశ్లేషకుల అంచనాలు కూడా ప్రస్తుతం ఉన్న 4,300 డాలర్ల నుంచి ఏకంగా 4,900 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నది. కానీ బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 అంచనా ప్రకారం 5,000 డాలర్ల వరకు పెరుగుతుందని తెలుపుతున్నారు. అంటే దీన్నిబట్టి మన దగ్గర బంగారం ధర విషయానికి వస్తే రూ. 1.75 వేల వరకు తాకోచ్చని తెలుపుతున్నారు. రానున్న కాలంలో ఔన్స్ 6,600 డాలర్ల వరకు చేరవచ్చని అంటే మన దగ్గర వచ్చేసరికి రూ. 2 లక్షల నుంచి 2.50 లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రూపాయి విలువ క్షీణిస్తే మరింత పెరగడం ఖాయమని తెలియజేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: