
ఈ ఉపఎన్నిక అటు బిఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. మరొక పార్టీ బిజెపి తన అభ్యర్థిని పోటీలో నిలిచినప్పటికీ ప్రధాన పోరు మాత్రం అటు కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగుతోందని విశ్లేషకులు తెలుపుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి తమ అభ్యర్థి అయిన మాగంటి సునీతని రంగంలోకి దింపారు, కాంగ్రెస్ పార్టీ మాత్రం నవీన్ యాదవ్ ని పోటీలో ఉంచారు. ఇప్పటికే రెండు పార్టీల ప్రచారాన్ని వేగవంతంగా చేస్తున్నాయి. రెండు పార్టీలు కూడా ఈ పోటీని చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గత ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి బరిలోకి దిగబోతున్నారు.ఈ నేపథ్యంలోనే తన గెలుపు పై బలమైన ధీమాని వ్యక్తం చేయడానికి ముఖ్య కారణం ఓవైసీ పార్టీ మద్దతు పలకడమే. అయితే గెలుపు,ఓటములు పక్కన పెడితే మాత్రం ఈ ఉప ఎన్నికలలో పరిస్థితి ఏంటి? ఓటర్లు ఏమంటున్నారనే విషయంపై ప్రముఖ పొలిటికల్ సర్వే ఆర్.ఆర్ పొలిటి సర్వే సంస్థ ఒక సర్వేని నిర్వహించింది.
ఈ సర్వేలో జూబ్లీహిల్స్ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. 33.35% మంది సునీతకి జై కొట్టారని, నవీన్ యాదవ్ కు 49.55 % మంది జై కొట్టారని. మిగిలిన 12.5 % శాతం మంది తెలియదు ,చెప్పలేమని తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎవరి వైపు ఉన్నారనే విషయంపై కూడా మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా సర్వేని తెలియజేసినట్లు వైరల్ గా మారుతున్నాయి.