
ఎవరికి వర్తించదు? (ఫీజు నుంచి మినహాయింపు) :
భారతీయులకు ముఖ్యమైన ఊరట ఏమిటంటే, అమెరికాలో ఉండి హెచ్-1బీ స్టేటస్‌కు మారేవారికి, లేదా ఇప్పటికే హెచ్-1బీ ఉన్నవారికి ఈ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. అమెరికాలో ఉన్న విద్యార్థులు (F-1 వీసా హోల్డర్లు): ఎఫ్-1 (F-1) విద్యార్థి వీసా నుంచి హెచ్-1బీ (H-1B) వీసాకు 'స్టేటస్ మార్పు' (Change of Status - COS) కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ భారీ ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
ప్రస్తుత హెచ్-1బీ హోల్డర్లు: ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హెచ్-1బీ వీసా ఉన్నవారు, పొడిగింపు (Extension), సవరణ (Amendment), లేదా యజమాని మార్పు (Change of Employer) కోసం దరఖాస్తు చేసుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పిటిషన్లు: సెప్టెంబర్ 21, 2025కు ముందు దాఖలు చేసిన పెటిషన్లకు ఈ ఫీజు వర్తించదు. లాటరీ విజేతలు: 2025 లాటరీలో గెలిచి, అప్రూవ్ అయిన పిటిషన్ ఆధారంగా వీసా స్టాంపింగ్ చేసుకుని తిరిగి వచ్చే వారికి కూడా ఈ ఫీజు వర్తించదు.
ముఖ్యమైన విషయం:
సాధారణంగా భారతీయ నిపుణులు అమెరికాలో చదువు పూర్తిచేసి, ఫ్లెక్సిబుల్ ఎఫ్-1 వీసా (OPT/STEM OPT) ద్వారా అక్కడి కంపెనీల్లో చేరి, ఆ తర్వాత హెచ్-1బీకి దరఖాస్తు చేసుకుంటారు. వీరంతా 'చేంజ్ ఆఫ్ స్టేటస్' కిందకు వస్తారు కాబట్టి, వారికి ఈ లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత్ లేదా చైనా వంటి దేశాల్లో ఉండి, కొత్తగా హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే ఈ భారం పడుతుంది. ఈ స్పష్టమైన మార్గదర్శకాలతో, అమెరికన్ కంపెనీలు తమ ప్రస్తుత అంతర్జాతీయ ఉద్యోగులను లేదా యూఎస్‌లో గ్రాడ్యుయేట్ అయినవారిని హెచ్-1బీకి మార్చుకోవడానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. ఇది భారతీయ ఐటీ నిపుణులకు, విద్యార్థులకు నిజంగా పెద్ద ఊరట.