
అదేవిధంగా, జర్మనీ మాజీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కూడా రాజకీయాల ముందు ఒక క్వాంటమ్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త. ఆమె పరిశోధనా మైండ్‌సెట్.. యూరోపియన్ రాజకీయాల్లో సమస్యలను భావోద్వేగంతో కాకుండా, తర్కంతో పరిష్కరించగల 'స్టబిలిటీ ఐకాన్'గా నిలబెట్టింది. కమెడియన్ ధైర్యం: ఐస్‌క్రీమ్ స్కూపర్ పట్టుదల! .. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కథ పూర్తిగా భిన్నం. రాజకీయ వేదికపైకి రాకముందు ఆయన ఒక కమెడియన్, నటుడు. వ్యంగ్యంతో ప్రజల హృదయాలను గెలిచిన ఆయన, యుద్ధ సమయంలో 'కమెడియన్ నుండి కమాండర్'గా మారి, తన ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి ఉద్యోగం ఒక ఐస్‌క్రీమ్ షాప్‌లో స్కూపర్. ఆ చిన్న ఉద్యోగం నేర్పిన క్రమశిక్షణ, ప్రజలతో మాట్లాడే ధైర్యం ఆయనను వైట్‌హౌస్ వరకు తీసుకెళ్లింది.
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ యవ్వనంలో ఒక పబ్లిక్ పూల్‌లో లైఫ్‌గార్డ్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం, నీటిలో మునిగే వారిని రక్షించిన అనుబంధం, సమాజాన్ని నిలబెట్టే ఆయన మార్గానికి బలమైంది. ఇంటెలిజెన్స్ వ్యూహం: ఛాయ్‌వాలా దార్శనికత! .. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతం ఒక కేజీబీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. రహస్య ఆపరేషన్లు, వ్యూహాలపై ఆయనకున్న అవగాహన, ఆయన నాయకత్వంలో 'ఇంటెలిజెన్స్ థింకింగ్'ను అగ్రభాగాన నిలబెట్టింది. ఇక భారతదేశం గర్వించే ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛాయ్‌వాలాగా జీవితం మొదలుపెట్టిన ఆయన, నేడు గ్లోబల్ లీడర్‌గా ఎదిగారు. ఇప్పటికీ తాను చాయ్‌వాలనే అని చెప్పుకోవడం ఆయన దార్శనికతకు ప్రతీక. ఈ కథలన్నీ ఒకే విషయం చెబుతున్నాయి: నాయకత్వం అనేది పదవితో వచ్చేది కాదు, అది జీవిత అనుభవాలతో రూపుదిద్దుకునే దృఢనిశ్చయం. నేడు మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, మన కల ఎంత గొప్పదన్నదే ముఖ్యం! సాధారణ మనిషి హృదయం నుంచి పుట్టే పట్టుదలే ప్రపంచాన్ని నడిపిస్తుంది!