ఆంధ్రప్రదేశ్లో 108,104 వాహనాల ద్వారా ఎంతో మంది ప్రజలకు మంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ప్రభుత్వాలు మారిన వీటిని మాత్రం కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి నిర్వహణ కాంట్రాక్టును ఇప్పుడు టిడిపి నేతకు కట్టబెట్టినట్లుగా వినిపించడంతో కూటమి నేతలపైన వైసిపి నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి అనుభవం లేనటువంటి సంస్థలకు ఇలాంటి వాహనాలు ఇస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్టే అంటూ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తమ సంపాదన పెంచుకోవడానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108,104 వాహనాలను ఉపయోగించుకున్నారంటూ వైసిపి మహిళా నేత రజిని ఫైర్ అవుతూ ట్వీట్ చేసింది.



గత వైసిపి పాలనలో కూడా అంబులెన్స్ల ద్వారా ఎన్నో మెరుగైన సేవలను అందించామని , కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని తమ సంపాద కోసం ఉపయోగించుకుంటోంది, తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో కొత్త అంబులెన్స్లను తీసుకువచ్చి, సాంకేతికంగా వాటిని మరింత అభివృద్ధి చేసే 24X7 ఉండే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ అంబులెన్సులు పల్లెలలో పట్టణాలలో ప్రజలకు అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతున్నాయని ఇప్పుడు వాటిని కూటమి ప్రభుత్వం భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి అప్పగించారు.


అయితే ఆ సంస్థ డైరెక్టర్ టిడిపి నేత డాక్టర్ పవర్ కుమార్ దోనేపూడి అంటూ తెలియజేశారు. ఈయన గతంలో టిడిపి డాక్టర్స్ సెల్ అధ్యక్షుడిగా ఉండేవారు.. అందుకే ఆయనకు అప్పగించారు. ఇందులో  రూ .2000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ , ఈ సంస్థ టర్నోవర్ కేవలం రూ. 5.52 కోట్లు మాత్రమే అలాంటి ఆర్థిక సహాయం లేనటువంటి సంస్థకు 108,104 వంటి నిర్వహణ కాంట్రాక్టులను ఎలా అప్పగిస్తారు?.. GVK, EMRI వంటి సంస్థలను కాదని టిడిపి నేతకి అప్పగించడానికి కారణం టీడీపీ పార్టీ రూ.31 కోట్ల రూపాయలు ప్రతినెలా తీసుకుంటోంది అంటూ తెలియజేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: