హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు గుండాలు, రౌడీయిజం ఎక్కువగా ఉండేవని నమ్మేవారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చి నిలబెట్టిన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ పెద్ద గూండా అని ఆరోపణలు చేశారు బిఆర్ఎస్,బిజెపి.అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలవడంతో శ్రీశైలం యాదవ్ కి చచ్చి బతికినట్టు అయింది.ఎందుకంటే చాలామంది గూండా వీడేం గెలుస్తాడు. టికెట్ ఇచ్చి తప్పు చేశారు. ప్రజలు వీరిని నమ్మరు అని అన్నారు.కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలిచి చూపించారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. గూండాలు అని మమ్మల్ని అందరూ తిట్టారు.కానీ ప్రజలు ఏ వైపు ఉన్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. 

మరో ఐదు రోజుల్లో నా తడాఖా ఏంటో చూపిస్తా.అలా అని గుండాగిరి దాదాగిరి ఏమీ చేయను. లీగల్ గానే వెళ్తా.. మాపై లేనిపోని నిందలు వేశారు.మరికొద్ది రోజుల్లో నా విశ్వరూపం చూపిస్తా.. బీఆర్ఎస్ మమల్ని గుండాలని తిట్టింది.కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడు. కానీ కౌశిక్ నవీన్ ఇద్దరు చదువుకునే రోజుల్లోనే ఫ్రెండ్స్. కాలేజీలో కౌశిక్ ని కొడితే మేమే కాపాడడం. అది కూడా మర్చిపోయాడు. తెలంగాణ పార్టీ భవన్ కి బుల్డోజర్ పంపకపోతే నా పేరు శ్రీశైలం యాదవ్ కాదు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కచ్చితంగా బొంద పెడతా. ఒకప్పుడు కేసీఆర్ కి కాపలాకాసాం.. అలాంటిది మమ్మల్ని రౌడీలు అన్నాడు. జీవన్ రెడ్డి,కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.

నేను ఒక్క ఆర్డర్ వేస్తే చాలు వాళ్ళ పని ఖతం. 1998లో టిడిపి తరఫున నేను ఎమ్మెల్యే కావాల్సింది. కానీ కొద్దిలో టికెట్ మిస్ అయింది..ప్రస్తుతం నా కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు. అది చాలు..త్వరలోనే నేను కూడా ఎమ్మెల్సీ అయి తీరుతాను. అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళతోనే నేను ఎమ్మెల్సీ అవుతా. ఎంతోమంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అవ్వడానికి నేను సహాయం చేశా. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ ఉన్నంతకాలం మాత్రమే.. ఒకసారి కేసీఆర్ తప్పుకుంటే పార్టీ 5 ముక్కలవుతుంది.కవిత, కేటీఆర్, హరీష్ రావు,ఉద్యమకారులు, బీసీలు వీళ్లంతా ఐదు ముక్కలుగా విడిపోతారు. అలాగే బీఆర్ఎస్ లో వీరందరికీ భాగం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్న శ్రీశైలం యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: