ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు.  వరసగా ఒక్కొక్కటిగా వీటిని నెరవేరుస్తున్నారు.  అక్కడితో ఆగకుండా జగన్ ఎవరైనా తప్పుచేస్తే వాళ్ళను సైతం వదలడం లేదు.  అవినీతికి ఎవరు పాల్పడినా దానికి పెద్ద శిక్షలు పడతాయని ఇప్పటికే హెచ్చరించారు జగన్.  కాగా, ఇటీవలే జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వయించింది.  


ఇందులో కొన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టుల నియామకానికి బీఏ, హ్యూమానిటి సబ్జెక్టు చేసిన వ్యక్తులు అర్హులు.  అయితే, కొంతమంది బికాం, బీఎస్సీ ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేశారు.  అందులో 21 మందికి ఉద్యోగాలు కల్పించారు.  ఇదే కేటగిరికి ఇంకా చాలామంది కూడా అప్లై చేశారు.  అయితే, బికాం, బీఎస్సీ ఉన్న తమను కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదని కొంతమంది అభ్యర్థులు కంప్లైంట్ చేశారు.  


అభ్యర్థుల కంప్లైంట్ తో అసలు విషయం బయటకు వచ్చింది. ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది.  బికాం, బీఎస్సీ అభ్యర్థులు అర్హులు కారు అని తెలిసి కూడా వారికి ఎలా ఉద్యోగాలు కల్పించారని అధికారులు ప్రశ్నించారు.  దీనిని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది.  బికాం, బీఎస్సీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందిన 21 మందిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధం అయ్యింది.  


అదే సమయంలో విద్యార్థుల సర్టిఫికెట్స్ ను వెరిఫై చేసి.. అర్హులు కారని తెలిసినా 21 మందికి ఉద్యోగాలు కల్పించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎవరైనా సరే ఈ విషయంలో తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని ఇప్పటికే వైకాపా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  సొంత ఎమ్మెల్యేలు తప్పు చేసినా వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి జగన్ వెనకడుగు వేయడం లేదు.  దానికి ఓ ఉదాహరణ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి అరెస్ట్ అని చెప్పాలి.  తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే అని వైకాపా ప్రభుత్వం మరోమారు నిరూపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: